ETV Bharat / business

ఈఎంఐ కట్టలేని స్థితికి 80% ఎంఎస్ఎంఈలు! - ఎంఎస్​ఎంఈల రుణ చెల్లింపు సామర్థ్యంపై ఆర్​బీఐ నివేదిక

కొవిడ్​ సృష్టించిన సంక్షోభంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్​ఎంఈ)లు కుదేలయ్యాయని ఆర్​బీఐ అధ్యయనంలో తేలింది. రుణాల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం విధించిన మారటోరియం సదుపాయాన్ని ఎంఎస్​ఎంఈలు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆర్​బీఐ వెల్లడించింది. లాక్​డౌన్​ సమయంలో దాదాపు 80 శాతం ఎంఎస్​ఎంఈలు ఈఎంఐలు చెల్లించలేకపోయాయని వివరించింది.

RBI REPORT ON MSMEs LOAN REPAYMENTS
కరోనాతో కుదేలైన ఎంఎస్ఎంఈలు
author img

By

Published : Jan 4, 2021, 3:21 PM IST

కరోనా మహమ్మారి వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్​ఎంఈ) తీవ్రంగా కుదేలయ్యాయని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్​బీఐ) వెల్లడించింది. లాక్​డౌన్ నేపథ్యంలో ఇచ్చిన మారటోరియం వెసులుబాటును ఐదింట నాలుగు ఎంఎస్ఎంఈలు వినియోగించుకోవడమే ఇందుకు ఉదాహరణగా తెలిపింది.

'ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్​ ఆఫ్​ బ్యాంకింగ్ ఇన్​ ఇండియా 2019-2020' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు పేర్కొంది ఆర్​బీఐ. ఏప్రిల్​తో పోలిస్తే.. ఆగస్టు నాటికి మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకునే రుణ గ్రహీతల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది.

దేశవ్యాప్త లాక్​డౌన్​లో ఈఎంఐల వాయిదా సదుపాయాన్ని భారీ సంఖ్యలో ఎంఎస్ఎంఈలు వినియోగించుకున్నాయని వివరించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్​ఎంఈలు వెన్నెముకగా భావిస్తుండటం, ఉద్యోగ కల్పనలో ఎక్కువ భాగం వీటిదే కావడం వల్ల.. పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతుందని వివరించింది.

ఇటీవలి అధికారిక గణాంకాల ప్రకారం.. 2020 ఆగస్టు చివరి నాటికి 45% బ్యాంక్​ వినియోగదారులు (కార్పొరేట్లు, ఎంఎస్​ఎంఈలు, వ్యక్తిగత, ఇతర రుణ గ్రహీతలు) మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు తెలిసింది. మొత్తం రుణాల్లో వీరి వాటా 40% శాతంగా ఉంది.

ఎంఎస్​ఎంఈ రుణాల్లో ఇలా..

మొత్తం 78 శాతం ఎంఎస్​ఎంఈలు ఈఎంఐల వాయిదాను ఎంచుకున్నాయి. ఎస్​ఎంఈలకు ఇచ్చిన మొత్తం రుణాల్లో ఈ 77.5 శాతం వీటిదేనని ఆర్​బీఐ నివేదిక వివరించింది. ఎస్​ఎంఈ విభాగంలో 45 శాతానికిపైగానికి పైగా రుణగ్రహీతలు మారటోరియంను వినియోగించుకున్నారు. 43 శాతం మంది వ్యక్తిగత రుణగ్రహీతలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. కార్పొరేట్​ రుణ గ్రహీతల్లో 31 శాతం మాత్రమే మారటోరియంను వినియోగించుకోవడం గమనార్హం.

ఆ బ్యాంక్​లపై దెబ్బ..

ఆర్​బీఐ డేటా ప్రకారం.. 39 అర్బన్​ కోఆపరేటివ్​ బ్యాంక్(యూసీబీ)​లపై మారటోరియం ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన 47 శాతం ఎస్ఎంఈలు మారటోరియం సదుపాయాన్ని ఎంచుకున్నాయి. ఆ బ్యాంకులు జారీ చేసిన మొత్తం ఎస్​ఎంఈ రుణాల్లో 90 శాతం మారటోరియం వినియోగించుకున్న ఎస్​ఎంఈలదే కావడం గమనార్హం.

ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదని ఆర్​బీఐ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ప్రతి నాలుగు ఎస్​ఎంఈల్లో మూడు సంస్థలు మారటోరియం సదుపయాన్ని వినయోగించుకున్నట్లు వెల్లడించింది.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్​బీఎఫ్​సీ)లదీ ఇదే పరిస్థితి. ఎన్​బీఎఫ్​సీల నుంచి రుణాలు పొందిన మూడింట రెండు కంపెనీలు మారటోరయం వెసులుబాటును వినియోగించుకున్నాయి.

స్మాల్​ ఫినాన్స్ బ్యాంకులూ మారటోరియం వల్ల ప్రభావితమయ్యాయి. ఈ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన 80 శాతానికిపైగా రుణ గ్రహీతలు (70 శాతం రుణాల వాటా వీటిదే) మారటోరియం సదుపాయాన్ని వాడుకున్నాయి.

ఇదీ చూడండి:క్యూ2లోనూ పెరిగిన కేంద్రం అప్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.