ETV Bharat / business

జీఎస్​టీ వివాదాల పరిష్కారం ఇక ఆన్​లైన్​లోనే!

author img

By

Published : Aug 23, 2020, 2:56 PM IST

Updated : Aug 23, 2020, 6:31 PM IST

జీఎస్​టీకి సంబంధించిన అన్ని వివాదాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించి పరిష్కరించాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం (సీబీఐసీ) నిర్ణయించింది. ఏప్రిల్​లో కస్టమ్స్, ఎక్సైజ్​ సుంకాలకు ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా సానుకూల స్పందన రావడం ఇందుకు కారణం.

Excise & Customs appleals
జీఎస్​టీ వివాదాలపై సీబీఐసీ కీలక నిర్ణయం

కరోనాతో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపులదారులకు.. ఊరటనిచ్చింది కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం (సీబీఐసీ). ఆర్థిక చట్టం 1994, ఛాప్టర్​ V పరిధిలోని.. సీజీఎస్​టీ, ఐజీఎస్​టీ, కస్టమ్స్​, ఎక్సైజ్ చట్టాల కింద అన్ని వ్యక్తిగత అపీళ్లను వీడియా కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని నిర్ణయించింది.

ఆర్థిక చట్టం 1994 పరిధిలోని కస్టమ్స్, ఎక్సైజ్ వివాదాల విచారణను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చేపట్టాలని ఈ ఏడాది ఏప్రిల్​లోనే సీబీఐసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. సీబీఐసీ తీసుకున్న ఈ నిర్ణయంతో అపీలేట్ ప్రక్రియ వేగవంతమైంది. తీర్పులు కూడా త్వరగా రావడం, ప్రయాణ ఖర్చులు తగ్గడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటికి తోడ్పడింది.

దీనితో నిపుణుల నుంచి ఈ విధానంపై సానుకూల స్పందన వచ్చింది. ఫలితంగా వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం గడువును పెంచింది సీబీఐసీ. అదే విధంగా ఈ సారి సీజీఎస్​టీ, ఐజీఎస్​టీ పరిధిలోని అన్ని వివాదాలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే పరిష్కరించాలని నిర్ణయించింది.

సీబీఐసీ నిర్ణయంపై సరఫరాదారులు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు, ప్రయాణికులు, న్యాయవాదులు ఇతర వాటాదారుల సానుకూలంగా స్పందిస్తున్నారు. వివాదాల పరిష్కారం సులభతరమవ్వడమే కాకుండా.. వేగవంతం కూడా అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా కాలంలో క్రెడిట్​ కార్డు వాడాలా వద్దా?

Last Updated : Aug 23, 2020, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.