రుణ గ్రహీతలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తూ.. రుణ ఖాతాలను బ్యాంకులు నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31 వరకు నిరర్ధక ఆస్తులుగా గుర్తించని ఖాతాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఆర్బీఐ విధించిన మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ ఎస్ రెడ్డి, జస్టిస్ ఎమ్ఆర్ షా ధర్మాసనం. తదుపురి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇదే తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించడం బ్యాంకుల చేతిలో ఉందా?లేదా? అన్న విషయాన్ని ఆర్బీఐ స్పష్టం చేయాలని సూచించింది సుప్రీం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ విషయంపైనా స్పందించాలని పేర్కొంది.
ఇదీ చూడండి:- 'వడ్డీ వసూలు చేస్తే మారటోరియంకు అర్థమేముంది?'