ETV Bharat / business

టీసీఎస్​ సీఈఓ జీతం రూ.20.36 కోట్లు - 2020-21లో సగటు వేతన పెంపు

2020-21 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్​ సీఈఓ, ఎండీ రాజేశ్​ గోపీనాథ్​ రూ.20.36 కోట్ల పారితోషికం అందుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో సంస్థ సీఓఓ ఎన్ గణపతి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించింది.

TCS annual report on Salaries
టీసీఎస్​ వేతనాల నివేదిక
author img

By

Published : May 19, 2021, 6:22 PM IST

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​​ (టీసీఎస్​) సీఈఓ, ఎండీ రాజేశ్​ గోపీనాథ్​ 2020-21లో రూ.20.36 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. 2019-20లో ఆయన పారితోషికం రూ.13.3 కోట్లుగా ఉండటం గమనార్హం.

టీసీఎస్​ నివేదిక ప్రకారం.. 2020-21లో గోపీనాథ్​ రూ.1.27 కోట్లు వేతనం రూపంలో, రూ.2.09 కోట్లు అలవెన్సుల రూపంలో, రూ.17 కోట్లను కమీషన్​గా అందుకున్నట్లు తెలిసింది.

ఇదే సమయంలో సంస్థ చీఫ్​ ఆపరేటింగ్ ఆఫీసర్​ (సీఓఓ).. ఎన్ గణపతి సుబ్రమణియం రూ.16 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలిపింది టీసీఎస్​. ఆయన వేతనం రూ.1.21 కోట్లుగా పేర్కొంది. అలవెన్సుల రూపంలో ఆయన రూ.1.88 కోట్లు, కమీషన్​గా రూ.13 కోట్లు తీసుకున్నట్లు వివరించింది.

గత ఆర్థిక సంవత్సరం ఉన్నత స్థాయి అధికారుల పారితోషికం సగటున 55.22 శాతం పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.

గత వార్షిక సంవత్సరం భారత్​లోని సంస్థ ఉద్యోగులు 6.4 శాతం (ఇతర అలవెన్సులతో కలిపి), విదేశాల్లోని సిబ్బంది 2-6 శాతం వరకు వేతనాల్లో పెంపును అందుకున్నట్లు వివరించింది టీసీఎస్​ నివేదిక. 2020-21 పూర్తయ్యేనాటికి సంస్థలో మొత్తం 4,48,649 ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:'ఎన్​ఫీల్డ్'​ బైకుల్లో లోపం- 2.36 లక్షల యూనిట్లు రీకాల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.