అమ్మకాల ఒత్తిడి నుంచి తేరుకుని.. నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి స్టాక్ మార్కెట్లు. దేశీయ సానుకూలతల నడుమ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు . ఐటీ షేర్లు సానుకూలంగా కొనసాగుతుండటం లాభాలకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 112 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 40,344 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 22 పాయింట్లకు పైగా వృద్ధి చెంది.. 11,879 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
ఐటీసీ, టీసీఎస్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్ బ్యాంక్ నేడూ భారీ నష్టాల దిశగా ట్రేడవుతోంది. ఎస్బీఐ, హెచ్యూఎల్, హీరో మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:స్మార్ట్ఫోన్కు రక్షణ కల్పించే కండోమ్ గురించి తెలుసా?