ETV Bharat / business

రూ.5 లక్షల కోట్లకు ఎస్​బీఐ గృహ రుణాల వ్యాపారం

author img

By

Published : Feb 10, 2021, 4:32 PM IST

ఎస్​బీఐ.. రియల్​ ఎస్టేట్​, హౌసింగ్ వ్యాపారం (ఆర్​ఈహెచ్​బీయూ) రికార్డు నెలకొల్పింది. ఈ విభాగం అసెట్​ అండర్​ మేనేజ్​మెంట్ (ఏయూఎం) రూ.5 లక్షల కోట్ల మార్క్​ దాటినట్లు ఎస్​బీఐ ప్రకటించింది. 2024 నాటికి దీనిని రూ.7 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.

SBI home loan AUM touched Rs 5 trillion-mark
ఎస్​బీఐ గృహ రుణాల వ్యాపారం కొత్త రికార్డు

భారతీయ స్టేట్ బ్యాంక్​ (ఎస్​బీఐ) గృహ రుణాల వ్యాపారం రూ.5 లక్షల కోట్ల మార్క్ దాటినట్లు బుధవారం ప్రకటించింది. రియల్​ ఎస్టేట్​, హౌసింగ్ వ్యాపారాలు (ఆర్​ఈహెచ్​బీయూ) గత పదేళ్లలో ఐదింతలైనట్లు వెల్లడించింది.

2011లో ఈ విభాగం అసెట్ అండర్​ మేనేజ్​మెంట్ (ఏయూఎం) రూ.89,000 కోట్లుగా ఉంటే.. ఇప్పుడది రూ.5 లక్షల కోట్ల మార్క్ దాటినట్లు వివరించింది ఎస్​బీఐ. 2024 నాటికి రూ.7 లక్షల కోట్ల ఏయూఎంను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

ఈ అసాధారణ వృద్ధి.. వినియోగదారులకు బ్యాంకుపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు ఎస్​బీఐ ఛైర్మన్​ దినేశ్​ ఖారా. గృహ రుణాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు వివిధ రకాల డిజిటల్​ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో గృహ రుణాల మార్కెట్​లో ఎస్​బీఐ వాటా ప్రస్తుతం 34 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:స్పెక్ట్రమ్​ వేలానికి దిగ్గజ టెల్కోలు రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.