ఇప్పటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని.. సరికొత్త గెలాక్సీ సిరీస్ వాచ్‌లను తీసుకొచ్చింది సామ్సంగ్. గెలాక్సీ వాచ్ యాక్టివ్, గెలాక్సీ ఫిట్, గెలాక్సీ ఫిట్-ఈ పేర్లతో విడుదల చేసింది.
చేతికి ధరించడానికి సౌకర్యంగా, తేలికగా ఈ వాచ్‌లు ఉంటాయని చెప్పారు సామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్.
సరికొత్త సదుపాయాలు...
వీటిలో గెలాక్సీ వాచ్ యాక్టివ్.. మిలీనియల్స్, జనరేషన్ జెడ్ వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన స్పోర్ట్స్ వాచ్. వ్యాయామం, నిద్ర, ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణను పర్యవేక్షిస్తుంది. రక్త పోటులో హెచ్చుతగ్గులనూ తెలియచేస్తుంది.
గెలాక్సీ వాచ్ యాక్టివ్‌ను అన్ని సామ్సంగ్ రిటైల్ స్టోర్లతో పాటు అమెజాన్, సామ్సంగ్ ఈ-షాప్‌లోనూ అందుబాటులో ఉంచింది. బ్లాక్, సిల్వర్, రోస్ గోల్డ్, డీప్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ధర రూ.19,900.
గెలాక్సీ ఫిట్.. సరికొత్త సాంకేతికతతో రూపొందింది. ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఫిట్నెస్ బ్యాండ్‌గా తయారుచేశారు. గెలాక్సీ ఫిట్ నలుపు, తెలుపు, పసుపు రంగులతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ధర రూ.9,990.
గెలాక్సీ ఫిట్-ఈ ధర రూ.2,590.
ఇవి సామ్సంగ్ స్టోర్లతో పాటు.. ఫ్లిప్‌కార్ట్, మింత్ర, సామ్సంగ్ ఈ-షాప్‌లో లభ్యమవుతాయి.
ఇదీ చూడండి: