స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోయాయి. కరోనా కాలంలోనూ వరుస పెట్టుబడులతో రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకిన సంస్థ షేర్లు సోమవారం 5 శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతున్నాయి. దీనితో సంస్థ షేరు విలువ దాదాపు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది.
బీఎస్ఈలో రిలయన్స్ షేరు విలువ ప్రస్తుతం 5.12 శాతం నష్టంతో రూ.1,949 వద్ద ట్రేడవుతోంది.
ఎన్ఎస్ఈలోనూ రిలయన్స్ షేరు 5.14 శాతం పడిపోయింది. ఒక షేరు విలువ ప్రస్తుతం రూ.1,949 వద్ద కొనసాగుతోంది.
షేర్లు భారీగా పడిపోయిన కారణంగా సంస్థ ఎం క్యాప్ (బీఎస్ఈలో) రూ.68,093.52 కోట్లు తగ్గి.. రూ.13,21,302.15 కోట్లకు చేరింది.
నష్టాలకు కారణం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ నికర లాభం 15 శాతం తగ్గినట్లు గత శుక్రవారం ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ నేపథ్యంలో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఇదీ చూడండి:అక్టోబర్లో మారుతీ, హ్యుందాయ్ జోరు.. రెండంకెల వృద్ధి