ఫేస్బుక్ అధినేత మార్క్‌జుకర్‌బర్గ్ ఇటీవల 7.2 బిలియన్ డాలర్ల (రూ.54 వేలకోట్లు) సంపదను కోల్పోయారు. ఫేస్బుక్లో ప్రకటనలు నిలిపివేయాలని కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణం.
యునిలీవర్ దెబ్బ..
సామాజిక మాధ్యమాలకు ఈ ఏడాది చివరి నుంచి ప్రకటనలు నిలిపివేయనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం యునిలీవర్ తీసుకున్న నిర్ణయంతో ఫేస్బుక్ షేర్లు శుక్రవారం ఏకంగా 8.3 శాతం నష్టపోయాయి. గత మూడు నెలల్లో ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. ఫేస్బుక్ మార్కెట్ విలువలో ఈ నష్టం విలువ 56 బిలియన్ డాలర్లుగా అంచనా. యునిలీవర్ సహా పలు ఇతర సంస్థలూ ఇలాంటి నిర్ణయాలే తీసుకోవడం వల్ల జుకర్‌బర్గ్ సంపద మొత్తం 7.2 బిలియన్ డాలర్లు తగ్గి.. 82.3 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా తెలిసింది.
ప్రకటనల నిలిపివేత ఎందుకు?
ఇటీవల అమెరికాలో జాత్యంహకర ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలపై ఒత్తిడి పెంచేందుకు దిగ్గజ సంస్థలు ప్రకటనలు నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే వెరిజోన్ కమ్యునికేషన్ సహా పలు సంస్థలు ఫేస్‌బుక్‌కు ప్రకటనలు నిలిపివేసి బాయ్‌కాట్ ఫేస్బుక్ పేరుతో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యునిలీవర్ చేరింది.
ఇదీ చూడండి:ఫేస్బుక్, ట్విట్టర్‌కు యునిలీవర్ షాక్