ETV Bharat / business

ప్రపంచంలో ఐదో స్ట్రాంగెస్ట్ బ్రాండ్​గా 'జియో'​ - ఐదో అతిపెద్ద బ్రాండ్​గా జియో

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే 5వ స్ట్రాంగెస్ట్​ బ్రాండ్​గా నిలిచింది. బ్రాండ్​ ఫినాన్స్ విడుదల చేసిన 'గ్లోబల్ 500' ర్యాకింగ్స్​లో ఈ స్థానాన్ని దక్కించుకుంది.

Jio 5th Strongest brand
ఐదో స్ట్రాంగెస్ట్​ బ్రాండ్​గా జియో
author img

By

Published : Jan 28, 2021, 5:23 PM IST

సంచలనాల టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో ఘనతను దక్కించుకుంది. మార్కెట్​లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే (ఐదేళ్లలోపే) ప్రపంచంలో ఐదో స్ట్రాంగెస్ట్ బ్రాండ్​గా అవతరించింది. బ్రాండ్​ ఫినాన్స్ విడుదల చేసిన 'గ్లోబల్​ 500' ర్యాంకింగ్స్​లో ఈ స్థానాన్ని దక్కించుకుంది.

ఈ జాబితాలో చైనాకు చెందిన 'వీ ఛాట్​' అగ్రస్థానంలో నిలిచింది. ​లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' (ఇటలీ), రష్యన్ బ్యాంక్ 'ఎస్​బెర్​', శీతల పానియాల సంస్థ కోకా-కోలా (అమెరికా) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జాబితాలో తొలిసారి..

జియో తొలిసారి ఈ జాబితాలోకి చేరి.. ఏకంగా ఐదవ స్థానాన్ని దక్కించుకోవటం విశేషం. ఈ భారతీయ టెలికాం సంస్థ 100కి 91.7 బీఎస్​ఐ స్కోరు సాధించింది. దీని బ్రాండ్ రేటింగ్ ఏఏఏ+ అని బ్రాండ్ ఫినాన్స్ నివేదిక తెలిపింది.

2016లో మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో.. 40 కోట్ల మంది చందాదారులతో దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థగా నిలిచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉంది.

ఇదీ చూడండి:ప్రపంచంలోనే మూడో విలువైన ఐటీ బ్రాండ్​గా 'టీసీఎస్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.