బంగారు ఆభరణాలు, ప్రతిమలకు 'హాల్‌మార్క్' గుర్తింపు తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2021 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు వినియోగదారు వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాసవాన్ వెల్లడించారు. పసిడి నాణ్యతను కచ్చితంగా నిర్ధరించేందుకు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు పేర్కొన్నారు.
దీనికి సంబంధించి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. నగల వ్వాపారుల వద్ద ఇప్పటికే ఉన్న స్టాక్‌ను విక్రయించేందుకు ఏడాది సమయమివ్వనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది కేంద్రం. ఆ తర్వాత 2021 జనవరి 15 నుంచి హాల్‌మార్క్ తప్పని సరి చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:మరోమారు తగ్గిన జీడీపీ.. 2019-20 క్యూ2లో 4.5 శాతమే