ETV Bharat / business

కాపీ రైట్​ కేసులో సుప్రీం కోర్టుకు గూగుల్, ఒరాకిల్

కాపీరైట్ కేసులో టెక్​ దిగ్గజాలు గూగుల్, ఒరాకిల్ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆండ్రాయిడ్ ఓఎస్​ కోడింగ్​కు సంబంధించి ఇరు సంస్థల మధ్య తలెత్తిన ఈ వివాదంపై బుధవారం వాదనలు విననుంది అమెరికా అత్యున్నత న్యాయస్థానం.

Copy right issue between Google Oracle
గూగుల్ ఒరాకిల్ కాపీరేటర్ వివాదం
author img

By

Published : Oct 7, 2020, 3:17 PM IST

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థలు గూగుల్, ఒరాకిల్ మధ్య కాపీరైట్ వివాదం మరింత ముదిరింది. ఇరు సంస్థలు ఈ వ్యవహారంపై అమెరికా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాయి. బుధవారం ఈ కేసు విచారణకు రానుంది.

వివాదం ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా మొబైల్​ ఫోన్లలో అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్​కు సంబంధించి గూగుల్, ఒరాకిల్​ మధ్య గత పదేళ్లుగా వివాదం కొనసాగుతోంది.

2007లో విడుదలైన ఆండ్రాయిడ్ ఓఎస్​ కోసం మిలియన్ల కొద్దీ కోడింగ్ లైన్లను గూగుల్ వినియోగించింది. అయితే అందులో 11,330 లైన్ల కోడింగ్​ను తమకు చెందిన జావా ప్లాట్​ఫామ్​ నుంచి తీసుకున్నట్లు ఒరాకిల్ ఆరోపిస్తోంది.

అయితే ఇది టెక్​ పరిశ్రమలో సాధారణంగా జరుగుతున్న ప్రక్రియేనని.. ఉత్తమ సాంకేతకతను రూపొందించేందుకు ఇది మంచిదేనని గూగుల్ తన చర్యను సమర్థించుకుంటోంది. అయితే ఒరాకిల్ మాత్రం గూగుల్ తమ కోడింగ్​ను.. చట్టవిరుద్ధంగా వినియోగించుకుందని ఆరోపిస్తూ.. 8 బిలియన్ డాలర్ల దావా వేసింది.

ఈ వివాదంపై ట్రయల్ కోర్టులో గూగుల్​కు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. అప్పీల్ కోర్టు ఆ తీర్పును అంగీకరించలేదు.

ఇదీ చూడండి:2021 నాటికి పుంజుకుంటాం.. కానీ‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.