ETV Bharat / business

వాల్​మార్ట్ ఇండియా ఇకపై 'ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌'

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్.. హోల్​ సేల్ వ్యాపారల సంస్థ వాల్​మార్ట్​ ఇండియాను కొనుగోలు చేసింది. భారత్​లో హోల్​ సేల్ వ్యాపారాలకు పెరుగుతున్న డిమాండ్​ను అందిపుచ్చుకునేందుకు ఈ కొనుగోలు జరిపింది.

flipkart buy Walmart
ఫ్లిప్​కార్ట్​ చేతికి వాల్​మార్ట్
author img

By

Published : Jul 24, 2020, 12:16 PM IST

Updated : Jul 24, 2020, 3:59 PM IST

ప్రముఖ హోల్​సేల్ వ్యాపార సంస్థ వాల్‌మార్ట్‌ ఇండియాను కొనుగోలు చేసినట్లు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ గురువారం వెల్లడించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో ఆ వివరాలను తెలియజేయలేదు. ఆగస్టు నుంచి 'ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌' పేరుతో టోకు వ్యాపార కార్యకలాపాలను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

650 బిలియన్‌ డాలర్ల పరిమాణం ఉన్న భారత రిటైల్‌ విపణిలోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్‌ ఈ కొనుగోలు చేపట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 28 'బెస్ట్‌ప్రైస్‌' టోకు విక్రయకేంద్రాలను వాల్‌మార్ట్‌ ఇండియా నిర్వహిస్తోంది.

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని పెట్టుబడి సంస్థల బృందం నుంచి ఇటీవలే 1.2 బిలియన్‌ డాలర్ల నిధులను ఫ్లిప్‌కార్ట్‌ సమీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే వాల్‌మార్ట్‌ ఇండియాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించడం గమనార్హం. 'ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌.. డిజిటల్‌ రూపేణా అందుబాటులోకి రానున్న కొత్త వేదిక. భారత్‌లోని బిజినెస్‌- టు- బిజినెస్‌ (బి-టు-బి) విభాగం అవసరాలపై ఇది దృష్టిపెడుతుంది. ఓ వైపు విక్రయదార్లను, తయారీదార్లను మరోవైపు కిరాణా దుకాణాలను, ఎంఎస్‌ఎమ్‌ఈలను ఇది సమర్థంగా అనుసంధానం చేస్తుంది.' అని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ఆదర్శ్‌ మీనన్‌ అన్నారు. కిరాణా దుకాణాలు, ఎంఎస్‌ఎంఈల అవసరాలను తీర్చే సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ కొనుగోలు లావాదేవీ ఉపయోగపడనుందని ఆయన తెలిపారు.

అమెజాన్​కు గట్టి పోటీ..

ఇప్పటికే బీ-టు-బీ విభాగంలో ఇదే తరహా సేవలు అందిస్తున్న అమెజాన్‌కు గట్టి పోట్టి ఇచ్చేందుకు కూడా ఇది దోహదం చేయనుంది. "పూర్తిగా తయారైన వస్తువుల బీ-టు-బీ విపణి విలువ 650 బిలియన్‌ డాలర్లుగా ఉందని అంచనా. ఇందులో 140 బిలియన్‌ డాలర్ల వ్యాపారంపై మేం దృష్టి సారించనున్నాం. ఇందులో ఫ్యాషన్, నిత్యావసరాలు, చిన్న, పెద్ద ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు లాంటివి ఉంటాయ"ని ఆయన అన్నారు.

ఆదర్శ్‌ మీనన్‌కు సారథ్య బాధ్యతలు

ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌కు ఆదర్శ్‌ మీనన్‌ నేతృత్వం వహించనున్నారు. వాల్‌మార్ట్‌ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపులో చేరతారు. వాల్‌మార్ట్‌ ఇంక్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా ఉన్న వాల్‌మార్ట్‌ ఇండియాలో సుమారు 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెస్ట్‌ప్రైస్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

ఇదీ చూడండి:ఇకపై అమెజాన్​ పే ద్వారా వాహన బీమా

Last Updated : Jul 24, 2020, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.