ETV Bharat / business

రేపు భారత మార్కెట్​లోకి ఎంఐ 10 స్మార్ట్​ ఫోన్​ - మే 8న మార్కెట్​లోకి ఎంఐ 10 స్మార్ట్​ ఫోన్​ విడుదల

మొబైల్ దిగ్గజం షియోమీ మరో కొత్త ఫోన్​ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లను తీసుకొస్తూ యువతకు దగ్గరైన ఈ సంస్థ మే 8న 'ఎంఐ 10' ఫోన్​ను దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరి ఈ ఫోన్​ ప్రత్యేకతలను తెలుసుకుందామా?

Xiaomi to launch Mi 10 in India on May 8
మే 8న మార్కెట్​లోకి రానున్న ఎంఐ 10 స్మార్ట్​ ఫోన్​
author img

By

Published : May 7, 2020, 8:01 AM IST

బడ్జెట్​ ధరల్లో స్మార్ట్​ఫోన్లు అందించే చైనా దిగ్గజ మొబైల్ సంస్థ షియోమీ నుంచి మరో కొత్త మొబైల్​ భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. వెనుకవైపు 108 మెగా పిక్సెల్ ప్రధాన​ కెమెరాతో రూపొందించిన ఎంఐ 10 స్మార్ట్​ఫోన్​ను మే 8న దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సిద్ధమైంది షియోమీ. ఇప్పటికే చైనా మార్కెట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది.

ఎంఐ 10 ప్రత్యేకతలు ఇవే..

  • 6.67 అంగుళాల పూర్తి హెచ్​డీ, సూపర్‌ అమోలెడ్​ డిస్​ప్లే
  • స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు (108 ఎంపీ+13ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4,780 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 30 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జర్​ సపోర్ట్‌

మే 8న ఎంఐ 10 మొబైల్​తో పాటు ఇయర్​ బడ్స్​ను కూడా అందించనుంది షియోమీ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.