ETV Bharat / business

నవంబర్​లో అదరగొట్టిన అమెరికా మార్కెట్లు - నాస్​డాక్​ నెలవారీ అత్యధిక లాభాలు

అమెరికా స్టాక్ మార్కెట్లు నవంబర్​లో అదరగొట్టాయి. డోజోన్స్ 30 ఏళ్ల తర్వాత అత్యధిగ నెలవారీ లాభాలను నమోదు చేసింది. ఎస్​ అండ్​ పీ 500, నాస్​డాక్​లు ఈ ఏడాది రెండో అత్యధిక స్థాయి లాభాలను గడించాయి. కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్ విజయవంతమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఇందుకు ప్రధానం కారణంగా తెలుస్తోంది.

Dow notches biggest month
వ్యాక్సిన్ నింపిన జోష్​తో అమెరికా మార్కెట్ల జోరు
author img

By

Published : Dec 1, 2020, 10:48 AM IST

అమెరికా స్టాక్ మార్కెట్లు నవంబర్​లో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. కరోనా వ్యాక్సిన్​పై వెలువడిన వార్తలు, ఇతర సానుకూల అంశాలు మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి.

డోజోన్స్​ 30ఏళ్ల తర్వాత అత్యధిక నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. నవంబర్​లో 11.9 శాతం లాభాలను గడించింది. ఇంతకు ముందు నెలవారీ ప్రాతిపదికన 1987 జనవరిలో అత్యధికంగా 13.8 శాతం వృద్ధిని నమోదు చేసింది డోజోన్స్.

సోమవారం సెషన్​లో మాత్రం డోజోన్స్ 0.9 శాతం నష్టంతో ముగిసింది.

ఎస్​ అండ్​ పీ 500 కూడా నవంబర్​లో 10.8 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది ఏప్రిల్​లో నమోదైన 12.7 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యధికం.

సోమవారం సెషన్​లో ఎస్​ అండ్​ పీ 500 0.5 శాతం నష్టంతో ముగిసింది.

టెక్ కంపెనీల ఎక్స్ఛేంజీగా పేరున్న నాస్​డాక్​ నవంబర్​లో 11.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది ఇదే రెండో అత్యధిక నెలవారీ వృద్ధి కావడం గమనార్హం. ఏప్రిల్​లో నాస్​డాక్ 15.5 శాతం లాభాలను గడించింది.

సోమవారం సెషన్​లో నాస్​డాక్ 0.1 శాతం నష్టంతో సెషన్​ను ముగించింది.

ఇదీ చూడండి:ఎస్‌‌అండ్​పీ చేతికి 'ఐహెచ్‌ఎస్'‌‌-2020లోనే అతిపెద్ద డీల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.