లాక్‌డౌన్ కారణంగా ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో అన్ని టెలికాం ఆపరేటర్లు అందుకు తగిన విధంగా డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్‌లకు డబుల్ డేటా ఇస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ కూడా తన వినియోగదారులకు ఈ డబుల్ డేటా ఇస్తోంది. ఇప్పుడు అదనంగా 2జీబీ, 5జీబీ డేటాను ఉచితంగా పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించనవసరం లేదు.
వొడాఫోన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగిస్తున్న వారు దీన్ని పొందవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా.. వొడాఫోన్ యాప్, వెబ్‌సైట్ ద్వారా మీ మొబైల్‌ను రీఛార్జ్ చేసుకోవడమే. రూ.149, రూ.249, రూ.399, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగిస్తున్న వారికి ఇది వర్తిస్తుంది. రూ.149తో రీఛార్జ్ చేసుకున్న వారికి ఇప్పటికే అందుతున్న 1జీబీ డేటాకు అదనంగా మరో 1జీబీ డేటాను పొందవచ్చు. దీని కాలపరిమితి 28రోజులు. ఇక రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 2జీబీ అదనపు డేటాను, రూ.249, రూ.399, రూ.599 రీఛార్జ్‌లకు ప్రతి రోజూ 1.5జీబీ డేటాకు అదనంగా రూ.5జీబీ డేటాను పొందవచ్చు. కేవలం వొడాఫోన్ యాప్, వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకునేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఇదీ చూడండి:స్వల్పంగా తగ్గిన పసిడి ధర- నేటి లెక్కలివే...