అవెంజర్స్ సినిమాతో మార్వెల్ పాత్రలను మన ముందుకు తీసుకొచ్చిన డిస్నీ.. మరో ముందడుగు వేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవా భాగస్వామ్యంతో మార్వెల్ పాత్రలను వర్చువల్ రియాలిటీ వీడియోగేమ్ రూపంలో తీసుకురానుంది.
గతంలో పోకీమ్యాన్ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ తరహా గేమ్ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు అవెంజర్స్ హీరోలతో పరిచయం చెయ్యనుంది డిస్నీ. దాదాపు ఆరు ఐకానిక్ మార్వెల్ హీరోలు, వారికి ఉన్న శక్తులు, ఆయుధాలు ఇప్పుడు మీ చేతుల్లోనూ ఉంటాయి. నిజంగా ప్రత్యర్థి ముందున్నట్లు కనిపిస్తుంది. ఎంతో మంది గేమ్ ప్రియులను ఈ తరహా టెక్నాలజీ ఆకట్టుకుంటుదని లెనోవా తెలిపింది.
లెనోవా ఈ గేమ్ ఆడటానికి ఏఆర్ హెడ్సెట్, హ్యాండ్ కంట్రోలర్స్ ఉపయోగించనుంది. వాటి సాయంతో థార్ సుత్తెను ప్రత్యర్థుల మీదకు విసిరేయచ్చు. బ్లాక్ పాంథర్ పంజా దెబ్బ రుచి చూపించవచ్చు. భవిష్యత్తులో విడుదల చేసే వర్చువల్ రియాలిటీ గేమ్‌లనూ ఆడే విధంగా హార్డ్‌వేర్‌ను రూపొందించినట్లు తెలిపింది లెనోవా.
''ఇప్పుడు మీరు థార్‌గా మారచ్చు. ఒక చేత్తో సుత్తె పట్టుకొని, మరో చేత్తో పిడిగుద్దులు విసురుతూ ప్రత్యర్థులను మట్టుపెట్టచ్చు. కెప్టెన్ మార్వెల్లా మీ చెతుల్లో నుంచి ఫోటాన్ కాంతిని ప్రసరిస్తూ వాటిని లేజర్స్గా మార్చేయచ్చు. బ్లాక్ పాంథర్ మాదిరిగా మీ పంజాలు.. శత్రువులను చంపేందుకు సహాయపడతాయి. అలాగే డాక్టర్ స్ట్రేంజ్లా కూడా మారచ్చు.''
-వాహిద్ రజలి,లెనోవా ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్
ఇదీ చూడండి: బొమ్మకోసం 2 ఊళ్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు