చైనీస్ సామాజిక మాధ్యమ వేదిక టిక్‌టాక్ దూసుకుపోతోంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా యాప్ డౌన్లోడ్లు సాధించి ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టేసింది. ప్రముఖ మార్కెటింగ్ సంస్థ 'సెన్సార్ టవర్' ఈ విషయాన్ని వెల్లడించింది.
2018లో డౌల్‌లోడ్స్ పరంగా నాలుగో స్థానంలో ఉన్న టిక్‌టాక్... 2019లో మాత్రం రెండో స్థానానికి చేరుకుంది. గతంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఫేస్బుక్ మెసెంజర్, ఫేస్బుక్ యాప్‌లను అధిగమించింది టిక్‌టాక్.
ఇండియా దయవల్లే..
టిక్‌టాక్ యాప్ రెండో స్థానంలో నిలవడానికి ఇండియానే ప్రధానకారణమని సెన్సార్ టవర్ తెలిపింది. ఎందుకంటే ఈ యాప్‌ను తొలిసారి డౌన్లోడ్ చేసుకున్నవారిలో 45 శాతం భారత్ నుంచే ఉన్నట్లు పేర్కొంది.
వాట్సాప్‌దే అగ్రస్థానం
టిక్‌టాక్ సూపర్ స్వింగ్‌లో ఉన్నా డౌన్లోడ్స్ పరంగా వాట్సాప్‌ను మాత్రం అందుకోలేకపోయింది. 850 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్స్‌తో వాట్సాప్ తొలిస్థానంలో నిలిచింది.
సెన్సార్ టవర్ ప్రకారం, వాట్సాప్ ప్రథమస్థానంలో ఉండగా.. టిక్‌టాక్ -2, ఫేస్బుక్ మెసెంజర్ -3, ఫేస్బుక్ - 4, ఇన్స్టాగ్రామ్ -5వ స్థానంలో ఉన్నాయి. ఇందులో టిక్‌టాక్ తప్ప మిగతా నాలుగు యాప్‌లూ ఫేస్బుక్వే కావడం గమనార్హం.
ఇదీ చూడండి: వీసా లేకున్నా ఈ దేశాలకు భారతీయులు వెళ్లొచ్చు!