ETV Bharat / business

'చక్రవడ్డీ' మాఫీపై నేడే సుప్రీంలో విచారణ - సుప్రీం కోర్టు

మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీ అంశంలో నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. రుణగ్రహీతలకు భారీ ఊరటనిస్తూ ఇప్పటికే అఫిడవిట్​ దాఖలు చేసింది కేంద్రం. రూ. 2 కోట్ల వరకు ఉన్న చక్రవడ్డీ మాఫీకి అంగీకరించింది.

The Supreme Court is hearing today
సుప్రీం కోర్టు
author img

By

Published : Oct 5, 2020, 10:46 AM IST

మారటోరియం సమయంలో రుణాల చక్రవడ్డీ మాఫీ అంశాన్ని నేడు విచారించనుంది సుప్రీం కోర్టు. ఇప్పటికే అఫిడవిట్​ దాఖలు చేసింది కేంద్రం. రుణ గ్రహీతలకు ఊరట కలిగిస్తూ రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాల వడ్డీపై వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపింది.

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​లో వివిధ రుణాలపై ఆర్బీఐ మారటోరియం అమలు చేసింది. ఆ వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయటం, ఆ వడ్డీపై వడ్డీ విధించటం వల్ల లాభమేమీ ఉండదని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం న్యాయస్థానం.. మారటోరియం ప్రయోజనాలను ప్రజలకు అందేలా చూడాలని కేంద్రాన్ని కోరింది.

వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధం..

ఈ అంశంలో ఇప్పటికే రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ.. వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ) వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది. రుణగ్రహీతలకు మారటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం తప్ప ఇంకో పరిష్కార మార్గం లేదని ఇటీవలే కేంద్రం అభిప్రాయపడింది. మారటోరియం వ్యవధి అయిన మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని తెలిపింది.

రూ.రెండు కోట్ల వరకు ఉన్న రుణాలపై ఈ ఆరు నెలల కాలంలో విధించే వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత, గృహ, విద్య, వాహన, వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్‌ కార్డు బకాయిలకు ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది.

కాగ్ సిఫార్సుతో వైఖరిలో మార్పు

బ్యాంకు రుణాలపై మారటోరియం కాలంలో విధించే వడ్డీపై వడ్డీ మాఫీ చేయడం సాధ్యం కాదని.. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా భారత ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు విన్నవించాయి. అయితే, మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహ్రిషీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫార్సుల నేపథ్యంలో సర్కార్‌ తన వైఖరిని మార్చుకుంది. వివిధ రంగాలపై కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ప్రభావంపై ఈ కమిటీ అధ్యయనం చేసింది.

ఇదీ చూడండి: రెండేళ్ల మారటోరియం.. భారమెంత? లాభమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.