ETV Bharat / business

Tesla recall: రెడ్ లైట్ పడినా ఆగని 'టెస్లా'- 54వేల కార్లు రీకాల్! - టెస్లా కార్లు రీకాల్

Tesla recall: ప్రముఖ ఎలక్ట్రానిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా..54 వేల కార్లను రీకాల్​ చేసింది. పుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ సాఫ్ట్​వేర్​లో సమస్య తలెత్తడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

Tesla recall
Tesla recall
author img

By

Published : Feb 2, 2022, 6:42 AM IST

Tesla recall Cars: విద్యుత్​ కార్ల తయారీ దిగ్గజం టెస్లా 54 వేల కార్లు, ఎస్​యూవీలను రీకాల్​ చేసింది. ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ సాఫ్ట్​వేర్​లో సమస్య తలెత్తడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్​ వద్ద రెడ్​ లైట్ పడినా.. ఆగకుండా ముందుకు వెళ్లిపోతుందని అమెరికా రక్షణ నియంత్రణ సంస్థ పేర్కొంది. ఇది భద్రతా పరమైన సమస్యగా మారిందని అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ మేరకు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో రెండుసార్లు సమావేశమైన తర్వాత టెస్లా రీకాల్‌కు అంగీకరించింది. అయితే ఆ ఫీచర్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదని టెస్లా చెబుతోంది. టెస్లా రీకాల్​ చేసిన కార్లలో మోడల్ ఎస్​ సెడాన్‌లు, ఎక్స్​ ఎస్​యూవీ, మోడల్ 3 సెడాన్‌లను, మోడల్ వై ఎస్​యూవీలు ఉన్నాయి.

అయితే టెస్లా డ్రైవర్లు ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్నారని.. కార్లు తమంతట తాముగా నడలేవని.. డ్రైవర్లు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం తలెత్తిన సమస్యను త్వరలోని పరిష్కరించనున్నట్లు పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'డిజిటల్ రూపీ' కథేంటి? కొత్త కరెన్సీతో లాభాలుంటాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.