ETV Bharat / business

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 362+

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Aug 6, 2020, 9:46 AM IST

Updated : Aug 6, 2020, 7:36 PM IST

15:35 August 06

టాటా స్టీల్ జోరు..

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 362 పాయింట్లు బలపడి 38,025 వద్దకు చేరింది. నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 11,200 వద్ద స్థిరపడింది.

  • టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫినాన్స్, హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
  • భారతీ ఎయిర్​టెల్, ఎం&ఎం, ఎల్​&టీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:41 August 06

భారీ లాభాలు..

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 360 పాయింట్లకుపైగా బలపడి 38,020 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభంతో 11,200 పైకి చేరింది. 

టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఎం&ఎం, మారుతీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

11:37 August 06

మిడ్​ సెషన్ ముందు సానుకూలం..

మిడ్​ సెషన్​ ముందు స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్ల లాభంతో 37,910 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా వృద్ధితో 11,182 వద్ద ట్రేడవుతోంది.

ఆర్థిక వృద్ధికి ఊతమందించే దిశగా ఆర్​బీఐ ఎంపీసీ సమీక్ష నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలు లాభాలకు కారణంగా తెలుస్తోంది.

ఓఎన్​జీసీ, టీసీఎస్​, టాటాస్టీల్, హెచ్​సీఎల్​టెక్, ఏషియన్ పెయింట్స్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి. 

యాక్సిస్ బ్యాంక్, ఎం&ఎం, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:58 August 06

సెన్సెక్స్ 210 ప్లస్​

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకుపైగా లాభంతో 37,876 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు పుంజుకుని 11,170 వద్ద కొనసాగుతోంది. ఐటీ షేర్లు మార్కెట్ల జోరుకు కారణంగా తెలుస్తోంది.

  • ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్​, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, టైటాన్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:09 August 06

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. రెపో రేటుపై ఆర్​బీఐ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచి తూచి వ్వవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 

బీఎస్​ఈ-సెన్సెక్స్ 160 పాయింట్లకుపైగా లాభంతో 37,824 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 60 పాయింట్లు బలపడి 11,161 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

బజాజ్ ఆటో, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టెక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్​ సానుకూలంగా స్పందిస్తున్నాయి.

మారుతీ, యాక్సిస్​ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఎం&ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Aug 6, 2020, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.