ETV Bharat / business

అన్​లాక్​ 2.0తో కొనుగోళ్ల జోరు.. 35,400పైకి సెన్సెక్స్ - స్టాక్ మార్కెట్లు లైవ్​

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jul 1, 2020, 10:02 AM IST

Updated : Jul 1, 2020, 3:47 PM IST

15:38 July 01

నష్టాలకు బ్రేక్..

వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ.. బుధవారం భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 499 పాయింట్లు బలపడి 35,414 వద్దకు చేరింది. నిఫ్టీ 128 పాయింట్ల వృద్ధితో 10,430 వద్ద స్థిరపడింది.  

  • దేశవ్యాప్తంగా రెండో దశ లాక్​డౌన్ సడలింపులతో కొనుగోళ్ల జోరు కొనసాగింది.
  • ఆర్థిక, హెవీ వెయిట్ షేర్లు లాభాలకు కారణమయ్యాయి.
  • యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాపడ్డాయి.
  • ఎన్​టీపీసీ, ఎల్​&టీ, నెస్లే, ఎం&ఎం, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

13:31 July 01

భారీ లాభాలు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 510 పాయింట్లకుపైగా బలపడి 35,428 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా లాభంతో 10,437 వద్ద ట్రేడవుతోంది. 

  • ఆర్థిక షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు కారణంగా తెలుస్తోంది. హెవీ వెయిట్​ షేర్లూ లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్​లాక్​ 2.0 ప్రారంభమైన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ మరింత బలపడిందని విశ్లేషకులు అంటున్నారు.
  • యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎన్​టీపీసీ, నెస్లే, ఎల్​&టీ, ఓఎన్​జీసీ, కోటక్​ బ్యాంక్, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:45 July 01

35 వేల పైకి సెన్సెక్స్

దేశీయ స్టాక్​ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ దాదాపు 190 పాయింట్ల లాభంతో 35,104 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 40 పాయింట్లకుపైగా బలపడి 10,349 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్, హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఎన్​టీపీసీ, కోటక్ బ్యాంక్, ఎల్​&టీ, ఓఎన్​జీసీ, టాటా స్టీల్, నెస్లే షేర్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jul 1, 2020, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.