ETV Bharat / business

వారాంతంలో మార్కెట్లకు లాభాలు- 43,400పైకి సెన్సెక్స్

ఆరంభ ఒడుదొడుకుల నుంచి తేరుకుని చివరకు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ స్వల్పంగా 86 పాయింట్లు పెరిగి..43,400పైకి చేరింది. నిఫ్టీ 29 పాయింట్ల స్వల్ప లాభంతో సెషన్​ను ముగించింది.

STOCK MARKETS UPDATE
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Nov 13, 2020, 3:47 PM IST

Updated : Nov 13, 2020, 4:23 PM IST

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఆరంభం నుంచే లాభనష్టాల మధ్య దోబూచులాడినా.. చివరకు లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి.. 43,443 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 12,720 వద్దకు చేరింది.

ఆర్థిక షేర్లు చివరి గంటలో పుంజుకోవడం లాభాలకు కారణంగా తెలుస్తోంది. హెవీ వెయిట్ షేర్లూ లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 43,522 పాయింట్ల అత్యధిక స్థాయి, 43,053 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 12,736 పాయింట్ల గరిష్ఠ స్థాయి 12,607 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

  • బజాజ్​ ఫిన్​సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో కోస్పీ సియోల్ సూచీ లాభాలను నమోదు చేసింది. షాంఘై, టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి.

రూపాయి, ముడి చమురు..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 2 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 74.62 వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.60 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 43.27 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్

Last Updated : Nov 13, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.