దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం విషయంలో 2020 అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచిచూడాల్సిందేనని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడమే ఇందుకు కారణం.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం మరో కారణం.
ప్రారంభంలో 119 పాయింట్లు నష్టపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 39 పాయింట్లు లాభపడి 40 వేల 715 వద్ద కొనసాగుతోంది. మొదట 12 వేల మార్కును కోల్పోయిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 11 పాయింట్లు లాభపడి 12 వేల 5 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
టాటా మోటార్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఓఎన్జీసీ రాణిస్తున్నాయి.
బజాజ్ ఫిన్సెర్వ్, కోల్ ఇండియా, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్‌సెంగ్, షాంఘై కాంపోజిట్, కోస్పీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి
రూపాయి విలువ 10 పైసలు క్షీణించి... ఒక డాలరుకు రూ.71.76గా ఉంది.
ఇదీ చూడండి: ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్‌కు పదోన్నతి