ఫెడ్ అంచనాలతో అమ్మకాల ఒత్తిడి
స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. బుధవారం లాభాలతో ముగిసిన సూచీలు.. గురువారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఫెడ్ ప్రతికూల అంచనాలు ప్రకటించిన నేపథ్యంలో విదేశీ మదుపరులు అమ్మకాలపై దృష్టిసారించారు.
గురువారం సెషన్లో సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 33,538 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 214 పాయింట్లు కోల్పోయి 9,902 వద్ద స్థిరపడింది.
ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్, నెస్లే, ఎం&ఎం షేర్లు మాత్రమే గురువారం లాభాలను నమోదు చేశాయి.
ఎస్బీఐ, సన్‌ఫార్మా, మారుతీ, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.