ETV Bharat / business

మార్కెట్ల జోరు..రూపాయి పరుగు.. దిగొస్తున్న పసిడి..!

author img

By

Published : Sep 20, 2019, 2:24 PM IST

Updated : Oct 1, 2019, 8:07 AM IST

రాకెట్​లో దూసుకెళ్తున్న సూచీలు... సెన్సెక్స్​ 2000+

15:47 September 20

కేంద్ర ఉద్దీపనలతో.. రికార్డు స్థాయి లాభాలు

స్టాక్​ మార్కెట్లు నేడు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. వృద్ధికి ఊతమందించే దిశగా కార్పొరేట్​ సుంకాలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్ల పర్వం మొదలైంది. వీటికి తోడు జీఎస్టీ మండలి సమావేశంలో మరిన్ని పన్నుల తగ్గింపు ఆశలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఏకంగా 1,921 పాయింట్లు ఎగబాకింది. చివరకు 38,014 వద్ద స్థిరపడింది. గత పదేళ్ళలో సెన్సెక్స్​ ఒక్కరోజు లాభాలు ఈ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 570 పాయింట్లు బలపడింది. నిఫ్టీ చరిత్రలో ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పెరగటం ఇదే ప్రథమం. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 11,274 వద్దకు చేరింది.
 
15:28 September 20

రూపాయి వృద్ధితో.. దిగొస్తున్న బంగారం ధరలు

  • గత కొన్ని రోజులుగా జీవనకాల గరిష్ఠాలను తాకిన బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతూవస్తున్నాయి.
  • 10 గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి ప్రస్తుతం రూ.38,390కు చేరింది. 
  • కిలో వెండి ధర రూ.120 తగ్గి.. రూ.47,580కి చేరింది.
  • దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండు తగ్గడం, రూపాయి బలపడటమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.

14:27 September 20

దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గింపే కారణం

దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నిర్ణయం తీసుకున్నందున స్టాక్​ మార్కెట్లు ఉరకలెత్తుతున్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు... నిర్మలా ప్రకటన అనంతరం.. ఒక్కసారిగా దూసుకెళ్లాయి. 1000, 1500, 2000 ఇలా గరిష్ఠ మార్కు దిశగా పరుగులు తీస్తున్నాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ 2000, జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ 500 పాయింట్ల మార్కును దాటి లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

ప్రస్తుతం బీఎస్​ఈ 2097 పాయింట్లు పెరిగి 38 వేల 190 వద్ద కొనసాగుతోంది.  నిఫ్టీ 617 పాయింట్ల వృద్ధితో 11 వేల 322 వద్ద ఉంది. 

14:06 September 20

కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో స్టాక్​ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ ఏకంగా 2000 పాయింట్లకు పైగా బలపడింది. నిఫ్టీ 650 పాయింట్ల పైచిలుకు లాభాన్ని నమోదు చేసి 11 వేల 357 వద్ద కొనసాగుతోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 2,200 పాయింట్ల భారీ లాభంతో 38 వేల 293 వద్ద ట్రేడవుతోంది.

లాభాల పట్ల మదుపర్లలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

Rajkot (Gujarat), Sep 20 (ANI): Garba nights are one of the most vibrant, spirited, and vivacious in Navratri celebrations. There is not only a lot of dancing to be indulged in but also a lot of food tasting, social bonding, and general festivities to be part of. And fashion, of course. From lehengas that are high on mirror work to bandhej skirts to vibrant jackets, Garba or dandiya nights are a celebration where you can not only be a part of a lot of fashion trends but also pick some up. From fabrics to embroidery techniques to prints, there is much to be experimented with and tried. But for now, let's sort out your Garba night outfits, shall we? This year, painted Chaniya Choli is on high demand. Navaratri is a Hindu festival that spans nine nights and is celebrated twice every year.
Last Updated : Oct 1, 2019, 8:07 AM IST

For All Latest Updates

TAGGED:

Sensex2000
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.