ETV Bharat / business

మాల్యా ఆస్తుల నుంచి బ్యాంకులకు రూ.5800కోట్లు

author img

By

Published : Jun 26, 2021, 5:35 AM IST

ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు చెందిన యూబీఎల్​ షేర్ల విక్రయం ద్వారా రూ.5800 కోట్లను తిరిగి పొందాయి ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకులు. ఈ మేరకు ఈడీ వెల్లడించింది.

enforcement directorate
enforcement directorate

రూ.9వేల కోట్లపైగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన యూబీఎల్​ షేర్ల విక్రయం ద్వారా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్టియం రూ.5,824.5 కోట్లను పొందింది. ఈ మేరకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ శుక్రవారం వెల్లడించింది.

కన్సార్టియం తరపున రుణ వసూళ్ల ట్రైబ్యూనల్‌ జూన్ 23న ఈ షేర్లను విక్రయించింది. మరో రూ.800 కోట్లు విలువైన షేర్లను జూన్‌ 25 లోగా విక్రయించి సొమ్ము రాబట్టుకునే అవకాశం ఉందని ఈడీ తెలిపింది.

ఇదీ చూడండి: బొక్కేస్తున్నారు.. చెక్కేస్తున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.