దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ... గెలాక్సీ ఏ-51ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఏ-50కి కొనసాగింపుగా మిలినియల్స్ కోసం సరికొత్త ఫీచర్స్‌తో ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జనవరి 31 నుంచి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో గెలాక్సీ ఏ-51 అమ్మకాలు ప్రారంభమవుతాయని శాంసంగ్ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద అమెజాన్ పే తో ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. దానితోపాటు ఒకసారి ఉచిత స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది.
గెలాక్సీ ఏ51 ఫీచర్లు
- 8జీబీ ర్యామ్, 128జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం
- ఆండ్రాయిడ్ 10 ఒన్ యుఐ 2.0 ఓఎస్
- 2.3 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ ఎక్స్‌నాస్ 9611 ప్రాసెసర్
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (1080x2400 పిక్సెల్) సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే
- 4,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ
కెమెరా
ఇందులో వెనకవైపు ఉన్న 4 కెమెరాలు, ఓ సెల్ఫీ కెమెరాలున్నాయి.
- 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా
- 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా
- 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
- 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
- 32 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా
ధర ఎంతో తెలుసా?
గెలాక్సీ ఏ51 ధరను రూ.23,999గా శాంసంగ్ నిర్ణయించింది. ప్రిసమ్ క్రష్ బ్లాక్, వైట్, బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.
ఇదీ చూడండి: భారత్‌లో వార్తల ప్రోత్సాహానికి గూగుల్ సాయం!