ETV Bharat / business

Reliance Industries: రిలయన్స్​కు హరిత ఇం'ధనం'! - రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పునరుత్పాదక ఇంధన వ్యాపారం

రిలయన్స్​ ఇండస్ట్రీస్(Reliance Industries)​ హరిత ఇంధనంపై దృష్టి సారిస్తుండడం వల్ల ఆ సంస్థకు భారీ అవకాశాలు లభించనున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించడం ఈ ఏడాది పూర్తి చేస్తే ఆర్‌ఐఎల్‌కు ప్రయోజనాలేనంటున్నాయి.

relianace mukesh ambani
'హరిత ఇంధనంతో రిలయన్స్​కు భారీ అవకాశాలు'
author img

By

Published : Jun 27, 2021, 7:37 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) హరిత ఇంధనంపై దృష్టి సారిస్తుండడం వల్ల ఆ సంస్థకు భారీ అవకాశాలు లభించనున్నాయని సిటీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, గోల్డ్‌మాన్‌ శాక్స్‌, క్రెడిట్‌ సూయిజీ తదితర అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. కంపెనీ 'గ్రీన్‌ ఏజీఎం'లో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) ప్రకటించిన దాని ప్రకారం.. జామ్‌నగర్‌లో 5,000 ఎకరాల్లో గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి మూడేళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అందులో నాలుగు గిగా ఫ్యాక్టరీలను కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇవి అమలైతే, కర్బన రహిత కంపెనీగా ఆర్‌ఐఎల్‌ అవతరిస్తుంది.

దీనితో కంపెనీ రీ-రేటింగ్‌కు అవకాశం ఉండడంతో పాటు, పెట్టుబడులపై వాటాదార్లకు స్పష్టత కనిపించనుందని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. హైడ్రోజన్‌, సోలార్‌ వ్యవస్థలకు మద్దతునిచ్చేందు కోసం కార్బన్‌ ఫైబర్‌ తయారీ, హరిత ఎరువులు, రసాయనాలపైనా ఆర్‌ఐఎల్‌() పెట్టుబడులు పెట్టనుంది. ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించడం ఈ ఏడాది పూర్తి చేస్తే ఆర్‌ఐఎల్‌కు ప్రయోజనాలేనంటున్నాయి.

కీలక భూమిక..

ఇప్పటికే ఆర్‌ఐఎల్‌కు చెందిన ప్రధాన మూడు వ్యాపారాలైన ఆయిల్‌-టు-కెమికల్‌(ఓ2సీ), రిటైల్‌, డిజిటల్‌లు నిలదొక్కుకోవడంతో పాటు లాభాలను ఆర్జిస్తున్నాయి. అంతక్రితం మూడు ఏజీఎమ్‌లకు భిన్నంగా తాజా ఏజీఎంలో పునరుత్పాదక ఇంధన ప్రణాళికలపైనే ఆర్‌ఐఎల్‌ ఎక్కువగా దృష్టి సారించింది. వచ్చే రెండు దశాబ్దాల్లో సంప్రదాయ ఇంధన ఆస్తులు దాదాపు జీవిత చరమాంకానికి చేరే అవకాశం ఉన్నందున, ఈ అడుగు వేయడం సరైన దిశగా తీసుకున్న నిర్ణయమని బ్రోకరేజీలంటున్నాయి. దీర్ఘకాలంలో ఆర్‌ఐఎల్‌ను దేశ ఇంధన వినియోగ వృద్ధి కథనంలో కీలక భూమికను పోషించేలా ఈ నిర్ణయం చేయగలదని భావిస్తున్నాయి. సోలార్‌ బ్యాటరీలు, ఎలక్ట్రోలైజర్స్‌, ఫ్యూయల్‌ సెల్స్‌ మార్కెట్‌లో ఆర్‌ఐఎల్‌ తిరుగులేని శక్తిగా మారేందుకు అవకాశం ఉందంటున్నాయి. ఈ ప్రణాళికతో భారత్‌ అవసరాలను తీర్చడమే కాకుండా అంతర్జాతీయ అవకాశాలనూ అందిపుచ్చుకునేందుకు వీలవుతుందని అభిప్రాయపడుతున్నాయి.

ఇక ప్రభుత్వం ఇటీవల దేశీయంగా సౌర విద్యుత్తు సామగ్రి తయారీని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన పీఎల్‌ఐ పథకాలతోనూ ఆర్‌ఐఎల్‌ ప్రయోజనాలను పొందుతుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి : జియో నయా వార్షిక ప్లాన్​తో రూ.689 ఆదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.