ETV Bharat / business

అమెజాన్​తో రిలయన్స్​ 2వేల కోట్ల డాలర్ల డీల్​!

తన రిటైల్​ సామ్రాజ్యంలోని 40శాతం వాటను అమెజాన్​కు రిలయన్స్​ ఆఫర్​ చేసినట్టు తెలుస్తోంది. 20 బిలియన్​ డాలర్ల విలువగల ఈ ఒప్పందంపై అమెజాన్​ కూడా ఆసక్తి కసబరిచినట్టు సమాచారం. డీల్​ ఓకే అయితే భారత రిటైల్​ రంగంలో ఇదే అతిపెద్ద ఒప్పందం కానుంది.

Reliance said to offer 40% stake in retail unit to Amazon for USD 20 bn
అమెజాన్​ చేతికి రిలయన్స్​ రిటైల్​ వాటా!
author img

By

Published : Sep 10, 2020, 7:03 PM IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మరింత వేగం పెంచింది. ఇప్పటికే అనేక సంస్థలు రిలయన్స్​లో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా... తన రిటైల్​​ విభాగంలోని 40శాతం వాటాను అమెజాన్​.కామ్​కు రిలయన్స్​ ఆఫర్​ చేసినట్టు సమాచారం. దీని విలువ 20బిలియన్​ డాలర్లు ఉంటుందని అంచనా.

ఈ ఒప్పందంపై అమెజాన్​తో రిలయన్స్​ ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలిసిందని బ్లూమ్​బర్గ్​ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. ఈ ఆఫర్​పై అమెజాన్​ ఆసక్తి కనబరిచినట్టు వివరించింది. ప్రస్తుతం ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నట్టు వెల్లడించింది.

ఒక వేళ అమెజాన్​ అంగీకరిస్తే.. భారత్ రిటైల్​ రంగం​లో ఇదే అతిపెద్ద ఒప్పందంగా మారనుంది. అయితే ఈ బ్లూమ్​బర్గ్​ వార్తపై స్పందించడానికి రెండు సంస్థలు నిరాకరించాయి.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.