ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ... 'రియల్మీ సీ3' పేరుతో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ని లాంఛ్ చేసింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ గతంలో విడుదలైన రియల్‌మీ సీ2 కి అప్ గ్రేడెడ్ వెర్షన్ అని సంస్థ తెలిపింది. మొబైల్లో ఎక్కువగా గేమ్స్ ఆడే వారిని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు పేర్కొంది.
స్పెసిఫికేషన్స్
- 6.5 ఇంచ్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే
- మీడియాటెక్ హెలియో జీ70 ఎస్ఓసీ ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
కెమెరా
- వెనుకవైపు 12 ఎంపీ + 2 ఎంపీ డ్యూయల్ కెమెరా సెట్ అప్
- ముందువైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
మూడు వేరియంట్లలో..
రియల్మీ సీ3 రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధరను రూ. 6999, అలాగే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ హైఎండ్ వేరియంట్ ధర రూ. 7,999 గా సంస్థ నిర్ణయించింది. ఈ ఫోన్ బ్లేజింగ్ రెడ్, ఫ్రోజెన్ బ్లూ రంగులలో అందుబాటులో ఉండనుంది.
ఫిబ్రవరి 14 నుంచి
ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్, అలాగే రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్ realme.com/in లో సేల్కు రానుందని, అదే విధంగా ఫిబ్రవరి 20 నుంచి ఆఫ్‌లైన్ ద్వారా అమ్మకాలను ప్రారంభించనున్నట్లు రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ తెలిపారు.
ఇదీ చూడండి: గూగుల్ సెర్చ్‌లో... మొబైల్ రీఛార్జ్ చేసుకోండి!