ETV Bharat / business

దేశంలో జీవనకాల గరిష్ఠానికి విద్యుత్​ డిమాండ్​

దేశవ్యాప్తంగా విద్యుత్​ డిమాండ్​ భారీ స్థాయిలో పెరిగి కొత్త రికార్డును నమోదు చేసినట్టు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో 185.82 గిగా వాట్లకు చేరి.. ఆల్​ టైమ్ రికార్డ్​ను నమోదు చేసిందని పేర్కొంది.

Power demand touches all-time high of 185.82 GW, says Secretary S N Sahai
'జీవనకాల గరిష్ఠానికి పెరిగిన విద్యుత్​ డిమాండ్​'
author img

By

Published : Jan 20, 2021, 10:39 PM IST

దేశంలో విద్యుత్​ డిమాండ్(ఒక రోజులో అత్యధిక సరఫరా)​ భారీగా పెరిగి 185.82 గిగా వాట్లతో.. జీవనకాల గరిష్ఠానికి చేరిందని సంబంధిత కార్యదర్శి ఎస్​ఎన్​ సహాయ్​ తెలిపారు. 'విద్యుత్​ డిమాండ్​ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం 9:35 గంటలకు 185.82 గిగా వాట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డ్​ 182.89 గిగావాట్లుగా(2020 డిసెంబర్​ 30) ఉండేది.' అని ట్విట్టర్​లో పేర్కొన్నారు సహాయ్​.

Power Secretary Sanjiv Sahay Tweet
విద్యుత్​ కార్యదర్శి సహాయ్​ ట్వీట్​

విద్యుత్​ శాఖ గణాంకాల ప్రకారం.. గత జనవరిలో గరిష్ఠ విద్యుత్​ డిమాండ్​ 170.97 గిగా వాట్లుగా ఉండేది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన క్రమంలో వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్​కు దారితీసే ఆర్థిక కార్యకలాపాలు పెరగటం.. విద్యుత్​ వినియోగం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.

కొవిడ్​-19 వ్యాప్తితో విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా.. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల ఏప్రిల్​ నుంచి ఆగస్టు వరకు విద్యుత్​ డిమాండ్​పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. అయితే.. సెప్టెంబర్​ నుంచి విద్యుత్​ డిమాండ్​ గణనీయంగా కోలుకుంది. అదే నెలలో 1.7శాతం, అక్టోబర్​లో 3.4 శాతం, నవంబర్​ 3.5 శాతం, డిసెంబర్​ 7.3 శాతం పెరిగింది.

ఇదీ చదవండి: '2020 క్యూ4లో 78% పెరిగిన ఇళ్ల విక్రయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.