ETV Bharat / business

త్వరలో రెండో విడత 'భారత నావికా సమ్మిట్​'

రెండో విడత భారత నావికా సమ్మిట్​ను ప్రధాని మోదీ మార్చి 2న ప్రారంభిస్తారని కేంద్రమంత్రి మన్​సుఖ్​ మాండవీయా వెల్లడించారు. సీప్లేన్​ సేవలను దేశమంతా విస్తరించనున్నట్లు తెలిపారు.

PM to inaugurate 2nd Maritime India Summit on Mar 2; 24 nations to attend: Mandaviya
రెండవ భారత నావికా సమ్మిట్​ మార్చి2న ప్రారంభం
author img

By

Published : Feb 11, 2021, 9:30 PM IST

భారత నావికా సమ్మిట్​ రెండో విడతను మార్చి 2న... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర నౌకాశ్రయ, షిప్పింగ్​, సముద్రయాన మంత్రి మన్​సుఖ్​ మాండవీయా తెలిపారు. వర్చువల్​గా జరిగే ఈ సమ్మిట్​లో 24 దేశాలు పాల్గొంటాయని అన్నారు.

ఈ సమ్మిట్​కు చైనా మినహా సముద్ర తీరం ఉన్న 56 దేశాల్ని ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ సహకారం పెంచేందుకు, భాగస్వామ్య దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ సమ్మిట్​ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సీప్లేన్​ సేవలు

మరోవైపు, దేశవ్యాప్తంగా సీప్లేన్​ సేవలను విస్తరించనున్నట్లు మాండవీయా తెలిపారు. దిల్లీ-జైపూర్​, దిల్లీ- ఉదయ్​పుర్​, దిల్లీ-జోధ్​పుర్​, దిల్లీ-బద్రినాథ్​ సహా పలు రూట్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అండమాన్​ నికోబార్​, లక్షద్వీప్​లలో కూడా సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. పౌర విమానయాన శాఖ సహకారంతో సీప్లేన్ రూట్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఎయిర్​లైన్ ఆపరేటర్లకు ఆహ్వానం పంపించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: తొలి సీ-ప్లేన్​ సేవలు ప్రారంభించిన ప్రధాని మో
దీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.