ETV Bharat / business

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంలో వ్యాజ్యం - న్యాయవాది వివేక్ నారాయణ్ శర్మ

చట్టాలను ఉల్లంఘిస్తూ.. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్న వాట్సాప్ నూతన ప్రైవసీ విధానాలను భారత్​లో అమలు చేయొద్దంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

cait moves to sc on wtsapp new rules
వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకు సీఏఐటీ
author img

By

Published : Jan 17, 2021, 6:01 AM IST

వాట్సాప్​ నూతన ప్రైవసీ విధానాలను వెంటనే ఉపసంహరించుకునేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఫేస్​బుక్, వాట్సాప్ వంటి కంపెనీలకు కేంద్రం కఠిన నింబంధనలు విధించేలా చూడాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) సుప్రీంకోర్టును కోరింది.

కేంద్రం విఫలం..

భారతదేశంలో వాట్సాప్ కార్యకలాపాలకు కేంద్రం అనుమతినిచ్చిందని.. అయితే పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో విఫలమైందని పిటిషన్​లో పేర్కొన్నారు. కేంద్రం తన రాజ్యాంగ విధిని నిర్వర్తించేందుకు ఈ వ్యాజ్యం అత్యవసరమని భావిస్తున్నట్టు న్యాయవాది వివేక్ నారాయణ్ శర్మ తెలిపారు.

జాతీయ భద్రతకు ముప్పు..

పార్లమెంటు సభ్యులు, మంత్రులు, న్యాయమూర్తులు, రక్షణ సిబ్బంది సహా.. కోట్ల మంది వ్యాపారులు ఉపయోగిస్తున్న వాట్సాప్​ గోప్యతా విధానాలపై రాజీ పడటం.. జాతీయ భద్రతను ప్రమాదంలో పడేయడమేనని పిటిషనర్​ అభిప్రాయపడ్డారు.

2017లో యూరోపియన్​ యూనియన్ దేశాల్లో, అంతకముందు జర్మనీలో వాట్సాప్​ నూతన విధానాల అమలును తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని వ్యాజ్యంలో గుర్తు చేశారు.

ఇదీ చదవండి: డేటా షేరింగ్‌పై 'వాట్సాప్‌' వివరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.