లిక్విఫైడ్ పెట్రోలియమ్ గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్ బుకింగ్ ప్రక్రియను ఇండియన్ గ్యాస్ మరింత సులభతరం చేసింది. మిస్డ్ కాల్‌తో గ్యాస్‌ను బుకింగ్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు కల్పించింది. దేశంలో ఎక్కడినుంచైనా 84549-55555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ గ్యాస్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మిస్డ్ కాల్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం ద్వారా సమయం ఆదా అవుతుందని, ఇందుకోసం ఎలాంటి కాల్ ఛార్జీలు ఉండవని తెలిపింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట!