దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల మోత కొనసాగుతోంది. వరుసగా 20వ రోజూ ధరలు పెంచాయి చమురు సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సోమవారం లీటర్ పెట్రోల్ ధర 21 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 17 పైసలు ఎగబాకింది. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13, డీజిల్ ధర రూ.80.19కి చేరింది.
వరుస ధరల పెంపుతో దిల్లీలో డీజిల్ ధర సరికొత్త గరిష్ఠానికి చేరింది. పెట్రోల్ ధర ఇప్పటికే రెండేళ్ల గరిష్ఠాన్ని దాటింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
నగరం | పెట్రోల్ (లీటరుకు రూ.లలో) | డీజిల్ (లీటరుకు రూ.లలో) |
దిల్లీ | 80.13 | 80.19 |
హైదరాబాద్ | 83.16 | 78.34 |
బెంగళూరు | 82.72 | 76.24 |
ముంబయి | 86.89 | 78.49 |
చెన్నై | 83.35 | 77.42 |
కోల్‌కతా | 81.80 | 75.32 |
ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఎవరికి లాభం?