ETV Bharat / business

కొత్త సంవత్సరంలో.. 'బంగారం' దారెటు? - కొవిడ్​ పరిణామాల్లో బంగారంపై పెట్టుబడులు

GOLD PRICE 2022: కొత్త ఏడాదిలో బంగారం ధర మరింత భగ్గుమంటుందా.. కాస్త దిగి వచ్చి, కొనుక్కునేందుకు అనువుగా మారుతుందా అనే ఆలోచనలు పలువురిలో ఉన్నాయి. కొవిడ్‌, ఒమిక్రాన్‌ పరిణామాలతో పాటు అమెరికా వడ్డీరేట్లు, బాండ్‌ రాబడులు, డాలర్‌ మారకపు విలువ వంటివి పుత్తడి ధరలపై ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా చూస్తే పసిడి దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించి, జీఎస్‌టీని మాత్రం పెంచుతారని, ఫలితంగా కొనుగోలుదార్లకు సుంకం రూపేణ మార్పు రాదని బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి.

gold
బంగారం
author img

By

Published : Dec 31, 2021, 7:45 AM IST

GOLD PRICE 2022: అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడులు ఎక్కువగా మళ్లేది సురక్షితమని భావించే బంగారానికే. కొవిడ్‌ పరిణామాల్లోనూ ఇదే సంభవించింది.. ఇప్పుడు వేగంగా ప్రబలుతున్న ఒమిక్రాన్‌ పరిణామాలూ అతీతం కాదు. నూతన సంవత్సరంలో కొవిడ్‌ కేసుల తీవ్రత అధికమై, అత్యధికులు ఆసుపత్రుల పాలైనా, ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు సంభవిస్తే కనుక, అంతర్జాతీయంగా-దేశీయంగా బంగారంపైకి పెట్టుబడులు మళ్లుతాయి. ఒకవేళ కొవిడ్‌ పరిణామాలు పెద్ద ప్రభావం చూపకపోతే మాత్రం పసిడి ధరల్లో ఉపశమనం తథ్యమన్నది బులియన్‌ విక్రేతల అంచనా. ద్రవ్యోల్బణ ప్రభావం నుంచీ రక్షణ కోసం పసిడిపై పెట్టుబడులు పెడుతుంటారు.

2022లో వడ్డీరేట్లను 3 సార్లు పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇప్పటికే తెలిపింది. అందువల్ల డాలర్‌ బలోపేతం అవుతుంది. ఇందువల్ల అంతర్జాతీయంగా పెట్టుబడులు డాలర్‌పైకి వెళ్లే అవకాశముంది. అప్పుడు పసిడి, ఇతర విలువైన లోహాలకు పెట్టుబడులు తగ్గుతాయి. ఇందువల్ల అంతర్జాతీయంగా పసిడి ధర తగ్గుతుంది. మన దేశానికి వస్తే మాత్రం, దిగుమతులపైనే అధికంగా ఆధారపడినందున, డాలర్‌ రూపేణ ధర తగ్గినా, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడితే, మనకు పుత్తడి అందకుండానే ఉంటుంది.

ధరలపై ప్రభావం ఇలా

కొత్త ఏడాదిలో అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 1700-1950 డాలర్ల మధ్య కదలాడే అవకాశం ఉందని ఇండియన్‌ బులియన్‌ జువెలరీ అసోసియేషన్‌, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ విభాగాల అధ్యక్షుడు చందా శ్రీనివాసరావు తెలిపారు. రూపాయల్లో చూస్తే గ్రాము మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.4700-5200 మధ్య కదలాడొచ్చనే అంచనాను వ్యక్తం చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కూడా ఔన్సు బంగారం 1670-1970 డాలర్ల శ్రేణిలో కదలాడొచ్చని అంచనా వేస్తోంది.

అక్రమ దిగుమతులు అరికట్టేందుకు..

బంగారం దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం ఎంత అధికంగా ఉంటే, విదేశాల నుంచి దొంగచాటుగా తెచ్చే వారికి అంతబాగా మిగులుతుంది. అందువల్లే విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో తనిఖీలు ఎంత క్షుణ్నంగా చేస్తున్నా, అక్రమార్కులు మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటున్నారు. ప్రస్తుతం పసిడి దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం 7.5 శాతం, 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌, మరో 10 శాతం సామాజిక సంక్షేమ సర్‌ఛార్జి విధిస్తున్నారు. ఇదికాక జీఎస్‌టీ 3 శాతం ఉంది. ఇతర వ్యయాలు కూడా కలుపుకుంటే, విదేశాలతో పోల్చుకుంటే 15 శాతం వరకు ధర దేశీయంగా ఎక్కువగా ఉంటోంది. విదేశాల నుంచి దొంగచాటుగా తేవడాన్ని నిరుత్సాహ పరిచేలా, కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించి, జీఎస్‌టీ పెంచే ప్రతిపాదనలు వచ్చే బడ్జెట్‌లో ఉండొచ్చని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందువల్ల ప్రజలపై అదనపు భారం పడదు.

ఇదీ చూడండి:'మరో ఐదేళ్లు జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.