దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు పెరగటమే ఇందుకు కారణమని వెల్లడించింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.22,500 వరకు పెంచనున్నట్లు పేర్కొంది.
సెలెరియో, స్విఫ్ట్ వంటి కార్లు.. ధరల పెరిగే మోడళ్లలో ప్రధానంగా ఉన్నాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నట్లు మారుతీ సుజుకీ స్పష్టం చేసింది.
పలు బడ్జెట్ మోడళ్లు అయిన ఆల్టో, ఎస్ క్రాస్ వంటి కార్ల ధరలు (ఎక్స్ షోరూం) ప్రస్తుతం.. రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షలుగా ఉన్నాయి. తాజా ధరల పెంపు నిర్ణయంతో వీటి ధరలు దాదాపు 1.6 శాతం పెరగొచ్చని మారుతీ సుజుకీ వివరించింది.
ఈ ఏడాది జనవరిలో కూడా మారుతీ సుజుకీ పలు ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.34 వేల వరకు పెంచింది.
ఇదీ చదవండి:కరోనా 2.0తో విమాన సంస్థలకు రూ.10 వేల కోట్ల నష్టం!