ఉద్యోగులు దేశీయంగా చేసిన విహారయాత్రల్లాంటి ప్రయాణాలకు అయిన ఖర్చులకు.. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందడానికి లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) (LTA exemption) ఉపయోగపడుతుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం నాలుగేళ్ల వ్యవధిలో (బ్లాక్) రెండు ప్రయాణాలకు మాత్రమే దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది. మరి ఈ రెండు ప్రయాణాలు నాలుగేళ్లలో ఎప్పుడైనా చేయొచ్చా అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు.
ప్రయాణాలు చేసేప్పుడు.. వెళ్లి వచ్చేందుకు ఎలాంటి నిర్దిష్ట నియమ నిబంధనలు లేవు. అంటే.. దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావొచ్చు. అలాగే.. నాలుగు సంవత్సరాల్లో రెండుసార్లు అంటే ఏడాది విడిచి ఏడాది అనే నిబంధనా లేదు. కాబట్టి నాలుగేళ్ల వ్యవధిలో(బ్లాక్) ఏవైనా రెండు ప్రయాణాలకు సంబంధించి పన్ను మినహాయింపుల కోసం ఎల్టీఏను(LTA exemption) క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఒకే ఏడాదిలో ఎల్‌టీఏ మొత్తాన్ని చెల్లించడానికి యజమాని(ఎంప్లాయిర్) సిద్ధంగా ఉన్నట్లయితే.. ఒకే బ్లాక్‌కు సంబంధించి రెండు ప్రయాణాలను కూడా అదే ఏడాదిలో చేయవచ్చు. 2018 నుంచి 2021 వరకు ప్రస్తుత బ్లాక్ నడుస్తోంది. ఈ క్యాలెండర్ ఇయర్స్‌లో తొలి రెండేళ్లలో(2018, 2019) ఎల్‌టీఏ మినహాయింపును(LTA tax exemption limit) క్లెయిమ్ చేయకపోతే.. అదే బ్లాక్‌లో ఉన్న 2020, 2021 సంవత్సరాల్లో పన్ను మినహాయింపును పొందవచ్చు.
విదేశీ ప్రయాణాల విషయంలో.. విమానాశ్రయానికి వెళ్లేంతవరకు అయ్యే ఖర్చుకు ఎల్‌టీఏ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి జీతాన్ని బట్టి ఎల్‌టీఏ(LTA tax exemption limit) ఆధారపడి ఉంటుంది.
ఇదీ చూడండి: 'రైల్వే' అరుదైన ఘనత- రూ.లక్ష కోట్ల క్లబ్‌లోకి ఐఆర్సీటీసీ