ETV Bharat / business

గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేట్లు ఇవే! - గృహ రుణాలపై ప్రస్తుత వడ్డీ రేటు ఎంత?

ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్ల సమయం కొనసాగుతోంది. అన్ని రుణాల మాదిరిగానే గృహ రుణాలపై వడ్డీ రేట్లు అల్పంగా ఉన్నాయి. వడ్డీ రేట్లు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల విషయంలో వేరు వేరుగా ఉన్నాయి. వాటి గురించి తెలుకుందాం..

home loans
గృహ రుణాలు
author img

By

Published : Jun 20, 2021, 10:31 AM IST

గృహ నిర్మాణం లేదా కొనుగోలు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లించే స్తోమత చాలా మంది వద్ద ఉండదు. ఇలాంటి వారు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గృహ రుణం తీసుకుంటారు.

గృహ రుణం వల్ల నెలవారీ వాయిదా(ఈఎమ్ఐ)ల ద్వారా ఆర్థికంగా భారం ఒకేసారి పడదు. నెలవారీ బడ్జెట్​పై ప్రభావం తక్కువగా ఉండేలా గృహ రుణం ఉపయోగపడుతుంది. గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వడ్డీ రేటు అనేది గృహ రుణంలో చాలా ముఖ్యమైనది. ఎక్కువ వ్యవధిలో రుణం తిరిగి చెల్లిస్తుంటారు కాబట్టి వడ్డీ రేటులో చిన్న తేడా కూడా మొత్తంగా చెల్లించే దానిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందిస్తున్న వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం.

  • కొటక్ మహీంద్ర బ్యాంకు - 6.65 శాతం
  • సిటీ బ్యాంకు - 6.75 శాతం
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 6.80 శాతం
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 6.70 శాతం
  • హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్ - 6.75 శాతం
  • ఐసీఐసీఐ బ్యాంకు - 6.90 శాతం
  • ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ - 6.90 శాతం
  • యాక్సిస్ బ్యాంకు - 6.90 శాతం
  • ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంకు - 7.00 శాతం
  • పంజాబ్ నేషనల్ బ్యాంకు - 6.80 శాతం
  • ఐడీబీఐ బ్యాంకు - 6.90 శాతం
  • కరూర్ వైశ్య బ్యాంక్ - 7.45 శాతం
  • పీఎన్​బీ హౌసింగ్ ఫైనాన్స్ - 7.35 శాతం
  • ఫెడరల్ బ్యాంక్ - 7.90 శాతం
  • సుందరం హోమ్ ఫైనాన్స్ - 6.95 శాతం
  • ఐఐఎఫ్ఎల్ - 8.70 శాతం
  • డీహెచ్ఎఫ్ఎల్ - 8.75 శాతం
  • హడ్కో హోం లోన్ - 8.95 శాతం
  • ఇండియా బుల్స్ - 8.99 శాతం

ప్రాసెసింగ్ ఫీజు

గృహ రుణం విషయంలో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు నిర్ణీత మొత్తం తీసుకుంటూ ఉండగా.. కొన్ని తీసుకున్న రుణంలో కొంత శాతాన్ని తీసుకుంటున్నాయి. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా రుణం తీసుకునే ముందు తెలుసుకోవాలి.

అందరికి ఒకేలా ఉండదు.

వడ్డీ రేటు అనేది అందరికి ఒకే విధంగా ఉండకపోవచ్చు. వడ్డీ రేటు అనేది పలు అంశాల ఆధారంగా నిర్ణయం అవుతుంది. క్రెడిట్ స్కోరు, రుణ వ్యవధి, ప్రాపర్టీ ఉన్న ప్రాంతం, లోన్ టు వాల్యూ రేషియో, వడ్డీ రకం తదితరాల అంశాలు ఇందులో ఉంటాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారి తక్కువ వడ్డీతో రుణం ఇచ్చేందుకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు మొగ్గుచూపుతుంటాయి.

నోట్: వడ్డీ రేట్లు మారొచ్చు. పరిశీలించగలరు.

ఇదీ చదవండి: Gold Price: క్రమంగా దిగివస్తున్న బంగారం ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.