దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 నేటి నుంచి ప్రారంభమైంది. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా .. కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు, డేటా, కాల్ సెంటర్ల వంటి వాటికి నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వడాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అయితే కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాయి.
కొత్త మార్గదర్శకాలతో 'మే'లే..
కొత్త మార్గదర్శకాలతో మే 4నుంచి మరో రెండు వారాలపాటు పొడిగించిన లాక్డౌన్ ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తోడ్పడనున్నట్లు పరిశ్రమల విభాగం ఫిక్కీ అధ్యక్షురాలు సంగీత రెడ్డి అన్నారు. అయితే ఇంకా చాలా కీలక ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయే ఉంటాయని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహానికి ఇదే సరైన సమయమని.. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఈ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు..
కేంద్రం అనుమతిచ్చినవాటిలో.. సెజ్, పారిశ్రామిక ఎస్టేట్లు, ఇండస్ట్రియల్తో పాటు మేము ఏదైతే కోరామో వాటిని అనుమతులు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పరిశ్రమల సామాక్య సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు.
మూడింట ఒక వంతు ఉద్యోగులతో ప్రైవేటు రంగ సేవా సంస్థలను తెరించేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంపై సీఐఐ డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే పరిశ్రమలు తిరిగి పుంజుకునేందుకు జీడీపీలో 3 శాతానికి సమానమైన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీఎస్టీ రేట్లు తగ్గించి.. రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని కోరారు చంద్రజిత్.
ఆంక్షలతో కూడిన ఆర్థిక కార్యకలాపాలకు.. తక్షణమే భారీ ఆర్థిక మద్దతు ఇచ్చినా పరిశ్రమ వెంటనే కోలుకోకపోవచ్చని చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.
వెంటనే ప్యాకేజీ ఇవ్వాలి..
ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్న పరిశ్రమల విభాగం అసోచామ్.. వెంటనే భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈటీవీ భారత్కు ఇచ్చిన సమాచారంలో పరిశ్రమల విభాగం అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్.. ప్రభుత్వ ప్యాకేజీలు జీఎస్టీ తగ్గింపు వంటికి కూడా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రభుత్వం వెంటనే బ్యాంకులకు అన్ని బకాయిలు, గ్యారంటీలు విడుదల చేయాలని..దాని ద్వారా బలహీనపడ్డ కంపెనీలకూ రుణాలు ఇవ్వగలగుతారని ఆయన తెలిపారు.
కేంద్రం మార్గదర్శకాలు ఇలా..
కొత్త నిబంధనల ప్రకారం.. అత్యవసర సరకుల తయారీ, ఔషధ, ఫార్మా, మెడికల్ డివైజ్లు, వాటి ముడి సరుకు ఉత్పత్తికి అనుమతిస్తున్నట్లు కేంద్రం హోం శాఖ స్పష్టం చేసింది.