ETV Bharat / business

ఈఎంఐ వాయిదాకు సాయం ముసుగులో ఖాతాలు ఖాళీ

author img

By

Published : Apr 11, 2020, 4:13 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. మరోవైపు సైబర్​ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈఎంఐలను వాయిదా వేసుకునేందుకు సహాయం చేస్తామంటూ వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అలాంటి మోసగాళ్ల వలలో పడకుండా బ్యాంకులు తమ వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నాయి. ఆ జాగ్రత్తలు మీరూ తెలుసుకోండి.

cyber crime latest news
సైబర్​ మోసాల పట్ల జాగ్రత్త

రుణాల చెల్లింపుపై 3 నెలలు మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ గత నెల ప్రకటించింది. కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.

బ్యాంకు ఉద్యోగుల పేరు వాడుకుని రుణ గ్రహీతలను మభ్య పెట్టి ఖాతా వివరాలు సహా ఇతర సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మారటోరియం సదుపాయం(ఈఎంఐల వాయిదా) వినియోగించుకోవడంలో సహాయం చేస్తామనే నేపంతో బ్యాంకు వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

ముఖ్యంగా ఆర్థిక భారం నుంచి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

బ్యాంకుల అప్రమత్తత...

సైబర్ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించిన బ్యాంకులు తమ ఖాతాదారులు వాటి వలలో పడకుండా చర్యలు ప్రారంభించాయి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారుల మొబైళ్లకు సందేశాలు పంపిస్తున్నాయి.

ఇలాంటి సైబర్ మోసాలు ప్రధానంగా సోషల్ మీడియా, ఈ-మెయిల్​, ఎస్​ఎంఎస్​, కాల్స్ ద్వారా జరుగుతున్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ వెల్లడించింది.

యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​ సహా ఇతర బ్యాంక్​లూ సైబర్​ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తమ వినియోగారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపాయి.

జాగ్రత్తలు..

బ్యాంకు ఉద్యోగి, ప్రభుత్వాధికారి పేరుతో ఏదైన ఫోన్​ కాల్, సందేశం ద్వారా డెబిట్​/క్రెడిట్​ కార్డ్​ నంబరు, సీవీవీ, కార్డ్​ పిన్​​, ఓటీపీ వంటి వివరాలు అడిగితే వాటిని మోసపూరితమైనవిగా గుర్తించాలని బ్యాంకులు తమ వినియోగదారులకు సూచిస్తున్నాయి.

ఈఎంఐలు వాయిదా వేసేందుకు ఓటీపీ వంటి వివరాలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి.

అలా ఎవరైన వివరాలు అడిగితే వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.