ETV Bharat / business

కియా, ఎన్​ఫీల్డ్​ నుంచి కొత్త మోడల్స్.. ధరలు ఇలా...

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోబైల్ దిగ్గజం 'కియా' మరో సరికొత్త మోడల్​ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సెల్టోస్ సిరీస్​లో ఈ కారు మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధరను రూ.17.79లక్షలుగా నిర్ణయించింది.

కియా
కియా
author img

By

Published : Sep 1, 2021, 4:32 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా నూతన మోడల్​ను ఆవిష్కరించింది. 'సెల్టోస్​ ఎక్స్-లైన్' పేరిట లాంచ్ చేసిన ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. మిడిల్ రేంజ్ ఎస్​యూవీ అయిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.17.79 లక్షలుగా కియా నిర్ణయించింది.

18 అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్​తో వస్తున్న పెట్రోల్ ఎక్స్- లైన్ 7డీసీటీ ట్రిమ్ ధర రూ.17.79 లక్షలు కాగా.. డీజిల్ ఎక్స్​-లైన్ 6ఏటీ వేరియంట్ రూ.18.10 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

కియా సెల్టోస్
కియా సెల్టోస్

ప్రారంభించిన రెండేళ్లలో కియా మోటార్స్ 2లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు సాధించిందని.. ఎస్​యూవీ సెగ్మెంట్​లో 40 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో కియా ఒకటని 'కియా ఇండియా' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

కియా సెల్టోస్
కియా సెల్టోస్

క్లాసిక్​గా..

ప్రముఖ మోటార్​ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్ 'న్యూ క్లాసిక్ 350' పేరుతో కొత్త బైక్​ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర(ఎక్స్ షోరూమ్-చెన్నై) రూ.1.8లక్షలుగా కంపెనీ పేర్కొంది. 2008లో ప్రారంభించిన క్లాసిక్ 350ని అత్యాధునిక సామర్థ్యంతో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

కియా సెల్టోస్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

"ఆధునికమైన జే సిరీస్ ఇంజిన్‌, సరికొత్త ఛాసిస్‌ అమర్చిన క్లాసిక్ 350 అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. డ్రైవ్ చేసిన ప్రతిసారీ కొత్తగా రైడింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది"

-సిదార్థ లాల్, ఐషర్ మోటార్స్ ఎండీ

న్యూ క్లాసిక్ 350 సీసీ రాయల్ ఎన్​ఫీల్డ్​.. ఎయిర్, ఆయిల్ కూల్డ్ వేరియంట్లలో లభించనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.