ETV Bharat / business

Crude Oil News: చమురు ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం! - crude oil release

భారత్​ అత్యవసర నిల్వల నుంచి సుమారు 5 మిలియన్​ బ్యారెళ్ల ముడి చమురును మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇలా చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గుతాయని పేర్కొన్నాయి(Crude Oil News).

oil price
ముడి చమురు ధరలు
author img

By

Published : Nov 23, 2021, 4:16 PM IST

అమెరికా, జపాన్​ లాంటి ఇతర దేశాలతో పాటు భారత్​లో కూడా చమురు ధరలను (Oil Price News) తగ్గించే దిశగా కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుంచి సుమారు 5 మిలియన్​ బ్యారెళ్ల ముడి చమురును మార్కెట్​లోకి విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి (Crude Oil News). సుమారు 38 మిలియన్​ బ్యారెళ్ల ముడి చమురును భారత్​... తూర్పు, పశ్చిమ తీరాల్లోని మూడు ప్రదేశాల్లో నిల్వ చేస్తుంది. అయితే ఇప్పుడు వాటి నుంచి సుమారు 5 మిలియన్​ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయనుంది.

7 నుంచి 10 రోజుల వ్యవధిలో దాదాపు 5 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. దీనిని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్​పీఎల్​), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్​) విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థలకు ఇప్పటికే అత్యవసర నిల్వల నుంచి పైప్‌లైన్ అనుసంధానం చేసి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత ముడి చమురును విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ వివాదానికి త్వరలోనే చెక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.