ETV Bharat / business

మదుపరులు ఏ షేర్లు కొంటే లాభదాయకం? - corona effect on stock market

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అప్పుడప్పుడూ కుప్పకూలడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, జీవిత కాల గరిష్ఠాలను చేరుకొని రికార్డులను నమోదు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కొవిడ్‌-19 మహమ్మారి చుట్టుముట్టింది. మదుపరులకు కనీసం ఆలోచించుకునే సమయమూ ఇవ్వకుండా లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ఎన్నో పతనాలను చూసినప్పటికీ.. ఈసారి మదుపరులలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. మరి, ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెట్టుబడులను కాపాడుకుంటూ... సంపదను సృష్టించేందుకు ఏం చేయాలి?

How to create wealth in the stock market?
కరోనా ఎఫెక్ట్​: స్టాక్​ మార్కెట్​లో సంపదను సృష్టించడమెలా..?
author img

By

Published : Mar 15, 2020, 7:53 AM IST

నాలుగు వారాల క్రితం 41,000లకు పైగా ఉన్న సెన్సెక్స్‌.. ప్రస్తుతం 34వేల దరిదాపుల్లోకి చేరుకుంది. అంటే దాదాపు 18 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఇదే తరహాలో 12వేల పైచిలుకు నుంచి 9900ల చేరువలోకి పడిపోయింది. ఇక్కడా నష్టం 18% వరకూ ఉంది. ఇక శుక్రవారంనాడైతే.. ఏకంగా మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. 45 నిమిషాలపాటు మొత్తం లావాదేవీలు నిలిచిపోయాయి. తిరిగి ప్రారంభంకాగానే.. వెనక్కి చూడకుండా.. 4శాతం లాభాలతో ముగిసింది. మార్కెట్‌ గమనాన్ని ఎవరూ ఊహించలేరనే దానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తే... 2008 పునరావృతం అవుతుందా అనే సందేహాలు రావడం సహజం. అప్పటి పరిస్థితులు ఇప్పుడు సరిపోతున్నాయా లేదా ఒకసారి మనం పరిశీలిద్దాం..

అప్పటితో పోలిస్తే...

  • 2003-2008 వరకూ స్టాక్‌ మార్కెట్‌ వృద్ధి దశలో కొనసాగింది. నిఫ్టీ 500 ఇండెక్స్‌ దాదాపు 48శాతం వార్షిక సగటు రాబడి (సీఏజీఆర్‌)ని అందించింది. 2015-2020లోనూ ఇలాంటి బుల్‌ దశే కనిపించింది. అయితే, ఇండెక్స్‌ కేవలం 8శాతం వార్షిక సగటు రాబడినే అందించింది.
  • ఆగస్టు 2007 నుంచి, జనవరి 2008 వరకూ మార్కెట్లు మంచి ర్యాలీ వచ్చింది. నిఫ్టీ 500 సూచీ ఈ 135 రోజుల సమయంలో దాదాపు 55శాతానికి పైగా వృద్ధి చెందింది. 2019లో చూస్తే ఇదే వ్యవధిలో పెరిగింది కేవలం 10శాతం మాత్రమే.
  • మార్చి 31, 2008 నాటికి నిఫ్టీ 500 మొత్తం మార్కెట్‌ క్యాప్‌ జీడీపీతో పోలిస్తే 83శాతం వృద్ధి చెందింది. 2005-2006 నుంచి 2019-2020 ఆర్థిక సంవత్సరం వరకూ గమనిస్తే ఇది సగటున 70శాతం మాత్రమే. ప్రస్తుతం ఇది పదేళ్ల కనిష్ఠం 60శాతానికి పడిపోయింది.

ప్రస్తుతం మార్కెట్లో మంచి నాణ్యమైన షేర్లు అందుబాటు ధరలోకి వచ్చాయనే చెప్పొచ్చు. 2012 తర్వాత ఇలాంటి అవకాశం రాలేదు. కొన్ని సరైన ధరకన్నా కాస్త కిందకు వచ్చినా.. దీర్ఘకాలిక మదుపరులకు మాత్రం ఇది మంచి అవకాశంగానే చెప్పొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వచ్చిన దిద్దుబాటును 2008 పతనంతో పోల్చలేం. జనవరి 2008లో మార్కెట్‌లు పతనం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ 2020లోనూ జనవరి నుంచే తగ్గడం ప్రారంభించాయి. ఇది మినహా పోల్చడానికి పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు.

'సిప్' మొత్తం పెంచండి​

క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో మదుపు చేస్తున్న వారికి ఇప్పుడు మరిన్ని యూనిట్లను జమ చేసుకోవడానికి మంచి అవకాశం చిక్కింది. వీలైతే మీరు మీ సిప్‌ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నించండి. దీర్ఘకాలంపాటు అధిక మొత్తాన్ని మదుపు చేయడం కష్టమనిపిస్తే.. కొన్నాళ్లపాటు కొన్ని ఖర్చులను కట్టడి చేయండి. ఆ మొత్తాన్ని సిప్‌ కోసం మళ్లించండి. కనీసం రానున్న 12 నెలలు వీలైనంత అధిక మొత్తం సిప్‌ ద్వారా పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. మార్కెట్‌ తిరిగి జీవనకాల గరిష్ఠాలను చేరుకున్న తర్వాత వీటి ఫలితాలు నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

భయంతో ఆమ్మొద్దు...

స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న భయాందోళనలను మనసు మీదకు తీసుకోవద్దు. భయపడి మీ దగ్గర ఉన్న షేర్లను అమ్మేస్తే.. కేవలం కాగితం మీద కనిపించే నష్టం.. వాస్తవంలోకి మారుతుంది. ఇలా చేసినప్పుడు తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి చాలా కాలం పడుతుంది. మార్కెట్‌పై విశ్వాసం ఉంచడంతోపాటు, కాస్త ఓపికగానూ ఉండాల్సిన తరుణమిది. ఒక్క శుభవార్తను వింటే చాలు.. ఈక్విటీ మార్కెట్లు మళ్లీ పరుగును అందుకుంటాయి. మార్కెట్‌లో నెలకొన్న హెచ్చుతగ్గులతో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయాల ప్రభావం కచ్చితంగా మన ఆర్థిక లక్ష్యాలపై పడుతుంది. భావోద్వేగాలతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మన కష్టార్జితాన్ని కోల్పోవద్దు.

ఒకేసారి మదుపు?

మా దగ్గర కొంత పెట్టుబడి ఉంది.. దాన్నంతా ఒకేసారి మార్కెటో మదుపు చేయొచ్చా? అనే సందేహం చాలామందికి వస్తోంది. ప్రస్తుత సమయంలో ఇది మంచి నిర్ణయం కాదు. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని 6 భాగాలుగా చెయ్యండి. మొదటి భాగాన్ని ఇప్పుడు వెంటనే పెట్టుబడి పెట్టండి. మార్కెట్‌ 1శాతానికి మించి పడిన ప్రతిసారీ ఒక్కో భాగాన్ని మదుపు చేయండి. ఇలా వీలుకాదనుకుంటే.. క్రమానుగత పెట్టుబడి విధానంలో 3-6 నెలల కాలంలో ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లించండి.

నేరుగా షేర్లు కొంటుంటే

తక్కువ ధరకు దొరుకుతున్నాయని నాణ్యత లేని షేర్లను కొనకండి. ప్రస్తుతం మంచి కంపెనీల షేర్లు అందుబాటు ధరలోకి వచ్చాయి. వీటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించండి. మీ పోర్ట్‌ఫోలియోలో.. నష్టదాయక షేర్లు ఉంటే.. వాటిని వదిలించుకోవడమే మంచిది.

వైవిధ్యం ఉండేలా..

నష్టభయం భరించే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడుల జాబితా ఉండాలి. ప్రతి మదుపరీ తన పెట్టుబడుల్లో ఈక్విటీ, డెట్‌, బంగారం, స్థిరాస్తి ఉండేలా చూసుకోవాలి. ఒకే పెట్టుబడి పథకంపై ఎక్కువగా ఆధారపడొద్దు. వీలైనంత వరకూ వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.

పెట్టుబడులు ఎప్పుడూ ఒకే రోజులో రెట్టింపు కావు. అవి వృద్ధి చెందేందుకు సమయం ఇవ్వాలి. ముఖ్యంగా నష్టభయం అధికంగా ఉండే షేర్లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మదుపు చేసినప్పుడు కనీసం 7-10 ఏళ్ల సమయం ఇవ్వాలి. రోజూ మార్కెట్‌ను గమనిస్తూ.. నా పెట్టుబడికి ఏమవుతుందో అని చూసుకోవడం వల్ల నిజంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. మార్కెట్‌ హెచ్చుతగ్గుల వల్ల మీ పెట్టుబడులు తక్కువ రాబడిని లేదా నష్టాన్ని ఇచ్చినట్లు కనిపించినా.. మొత్తం అలాగే కొనసాగుతుందని అనుకోవద్దు. మార్కెట్‌కు మంచి రోజులు వచ్చినప్పుడు మీ పెట్టుబడి మొత్తం మీరు అనుకున్న స్థాయుల్లోనే రాబడిని అందిస్తుందని చెప్పొచ్చు.

- సాయి కృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.