ETV Bharat / business

చమురు ధరల పతనంతో భారత్​కు వచ్చే లాభాలేంటి? - సౌదీ రష్యా చమురు యుద్ధం

కరోనా ప్రభావం, సౌదీ-రష్యా విభేదాలతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో పతనమయ్యాయి. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డ భారత్​కు ఈ ధరల తగ్గుదలతో చేకూరే లాభమేంటి?

crude
చమురు ధరలు
author img

By

Published : Mar 10, 2020, 9:03 AM IST

అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ఒపెక్ దేశాలు, రష్యా మధ్య విభేదాలతో నేలకు దిగొచ్చిన ముడి చమురు ధరలు.. ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగే వరకు క్రూడ్​ ధరలు నేలపైనే ఉంటాయని చెబుతున్నారు.

బ్రెంట్ క్రూడాయిల్ ధరలు సోమవారం 30 శాతం పడిపోయి 31 డాలర్లకు చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్​ ఇంటర్మీడియట్​(డబ్ల్యూటీఐ) కూడా 27 శాతం క్షీణించి 30 డాలర్లకు దిగజారి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత అంతటి భారీ పతనాన్ని చవిచూశాయి చమురు ధరలు.

అయితే ఈ రోజు స్వల్పంగా పెరిగిన డబ్ల్యూటీఐ, బ్రెంట్ ధరలు 33, 36 డాలర్లకు చేరుకున్నాయి.

ఎందుకిలా?

చమురు ధరలు భారీగా పడటానికి మొదటి కారణం సౌదీ అరేబియా, రష్యా మధ్య విభేదాలు. కరోనా వైరస్ నేపథ్యంలో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో ఒపెక్‌ గురువారం సమావేశమై ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. 2020 చివరి వరకు 1.5 మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిపై కోత పెట్టాలని నిర్ణయించింది. గత డిసెంబర్‌లో నిర్ణయించిన చమురు ఉత్పత్తి కోతకు ఇది అదనం.

కానీ, ఒపెక్‌ దేశాలతోపాటు చమురు ఉత్పత్తిలో అతిపెద్ద దేశమైన రష్యా దీనికి ససేమిరా అంటోంది. ఇది సౌదీ అరేబియాకు ఇబ్బందికరంగా మారింది. చమురు బ్యారెల్‌కు 83డాలర్ల ధర లభిస్తేనే ఆ దేశ బడ్జెట్‌ అంచనాలను అందుకుంటుంది. మరోపక్క చమురు ధర బ్యారెల్‌కు 43 డాలర్ల కంటే తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ఈ నేపథ్యంలో వియన్నాలో జరిగిన భేటీలో చమురు ఉత్పత్తి దేశాలు, రష్యా ఒక అవగాహనకు రాలేదు. సౌదీ అరేబియా చేసిన ప్రయత్నాలు మొత్తం ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితంగా ఎక్కువ చమురు తక్కువ ధరకు విక్రయించి లాభం సొంతం చేసుకోవాలని సౌదీ ప్రణాళిక వేసినట్లు విశ్లేషకుల అంచనా.

భారత్​కు ఎలా లాభం?

జనవరి నుంచి దేశీయంగా పెట్రోల్, డీజిల్​పై రూ.4 తగ్గింది. ఇవి మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియల్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్​పీసీఎల్​ భారీగా లాభపడతాయి.

అయితే అంతర్జాతీయ ధరలను అమలు చేసేందుకు రిటైలర్లకు కనీసం వారం రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం భారీగా తగ్గిన ధరలు దేశీయంగా ఎంత ప్రభావాన్ని చూడాలంటే మరో వారం ఆగాల్సిందే.

భారత్ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాం. ఫలితంగా భారత్​కు ఇది ఎంతో లాభం చేకూర్చుతుంది. క్రూడాయిల్​పై డాలర్​ తగ్గితే మొత్తంగా దిగుమతులకు సంబంధించి రూ.3,000 కోట్ల భారం తగ్గుతుంది. 45 డాలర్ల వద్ద చమురు ధరలు ఉంటేనే మన దేశానికి రూ.14,000 కోట్ల మిగులు లభిస్తుంది.

ఇంధన ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. చమురు ధరలు 10 శాతం పడిపోతే ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. వీటితో రాయితీలు తగ్గుతాయి. కరెంట్ ఖాతాలోటు తగ్గుతుంది.

(రచయిత- డాక్టర్ హిరణ్మయి రాయ్​, ఎకనామిక్స్​ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్​)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.