ETV Bharat / business

'సెప్టెంబర్​లో 24శాతం పెరిగిన నియామకాలు'

దేశవ్యాప్తంగా అన్​లాక్ ప్రక్రియ​తో ఉద్యోగ నియామకాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్​లో నియామకాలు.. ఆగస్టుతో పోలిస్తే 24 శాతం పెరిగినట్లు ప్రముఖ జాబ్​ పోర్టల్ నౌక్రీడాట్​కామ్ నివేదికలో వెల్లడైంది.

Hiring activity in India rise
ఉద్యోగనియమాకాల్లో వృద్ధి
author img

By

Published : Oct 12, 2020, 8:49 PM IST

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుతున్న తరుణంలో..సెప్టెంబర్​లో ఉద్యోగ నియామకాలు పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. ప్రముఖ ఆన్​లైన్ జాబ్​ పోర్టల్ నౌక్రీ ప్రకారం.. ఆగస్టుతో పోలిస్తే ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు సెప్టెంబర్​లో 24శాతం పుంజుకున్నాయి.

నౌక్రీ నివేదికలో ముఖ్యాంశాలు..

  • ఫార్మా రంగం (44 శాతం), ఎఫ్​ఎంసీజీ (43 శాతం), విద్య- టీచింగ్ (41 శాతం) విభాగాల్లో ప్రధానంగా నియామకాల్లో వృద్ధి నమోదైంది.
  • అన్​లాక్ ప్రక్రియతో రియల్టీ రంగంలో నియామకాల కార్యకలాపాలు భారీగా (44 శాతం) పెరిగాయి.
  • ఆటో.. దాని అనుబంధ రంగాలు (29 శాతం), ఆతిథ్య- పర్యటక రంగాల్లో (48 శాతం) నియామక కార్యకలాపాలు పుంజుకున్నాయి.
  • కీలక రంగాలైన బీపీఓ, ఐటీలో 29 శాతం, బ్యాంకింగ్ ఆర్థిక సేవల విభాగాల్లో 33 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైంది.
  • నగరాల వారీగా చూస్తే.. పుణెలో అత్యధికంగా 26శాతం, హైదరాబాద్​, చెన్నైలలో 24శాతం, బెంగళూరులో 14శాతం నియామకాలు పుంజుకున్నాయి.
  • నియామకాలు భారీగా పుంజుకున్న టైర్​ 2 పట్టణాల్లో.. అహ్మదాబాద్‌ (34 శాతం), ఛండీగఢ్‌ (39 శాతం), జైపుర్ (36 శాతం)లు ఉన్నాయి.

ఇదీ చూడండి:పండుగలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.