ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్ ఫుడ్​​ రిటైల్ బిజ్ ప్లాన్స్​కు కేంద్రం బ్రేక్​ - Flipkart in food retail sector

దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్​ రంగంలోకి ప్రవేశించాలన్న ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్​ వేసింది. అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. నియంత్రణ విషయంలో సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది.

Govt rejects Flipkart's proposal
ఆహార​ రిటైల్​ రంగంలోకి ఫ్లిప్​కార్ట్​ ఎంట్రీకి కేంద్రం బ్రేక్​
author img

By

Published : Jun 1, 2020, 7:08 PM IST

ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​కు కేంద్రం షాకిచ్చింది. దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్​ రంగంలోకి ప్రవేశించడానికి అనుమతులు కోరుతూ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ, ఇంటర్నల్​ ట్రేడ్​ విభాగం (డీపీఐఐటీ). నియంత్రణ విషయంలో సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.

గతంలోనే ఆహార ఉత్పత్తుల రిటైల్​ రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రంగంలోకి ప్రవేశించేందుకు గతేడాది 'ఫ్లిప్​కార్ట్​ ఫార్మర్​మార్ట్​' పేరిట స్థానిక విభాగాన్ని స్థాపించింది ఆ సంస్థ. అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.

మరోమారు..

తమ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో మరోమారు దరఖాస్తు చేసుకుంటామని తెలిపారు సంస్థ ప్రతినిధి ఒకరు. సాంకేతికత, కొత్త ఆవిష్కరణల ఆధారంగా నడిచే మార్కెట్​లో పారదర్శకత, విలువల సామర్థ్యం పెంచటం ద్వారా దేశీయ రైతులు, ఫుడ్​ ప్రాసెసింగ్​ రంగానికి దన్నుగా నిలుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. దాని ద్వారా రైతుల ఆదాయం పెరిగి, భారత వ్యవసాయ రంగంలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.

2017లోనే అమెజాన్​కు..

భారత్​లో ఆహార ఉత్పత్తుల రిటైల్​ రంగంలో సుమారు 500 మిలియన్​ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్​కు 2017లోనే అనుమతి ఇచ్చింది కేంద్రం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.