ETV Bharat / business

గూగుల్ పిక్సెల్​ 5ఏ రిలీజ్​ డేట్ ఫిక్స్​! - గూగుల్​ పిక్సెల్ 5ఏ లేటెస్ట్ న్యూస్​

గూగుల్​కు చెందిన స్మార్ట్​ఫోన్ల విభాగం పిక్సెల్ నుంచి 5ఏ మోడల్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది అందుబాటులోకి వచ్చిన పిక్సెల్​ 4ఏ లానే తొలుత ఎంపిక చేసిన మార్కెట్లలోకి ఈ కొత్త ఫోన్​​ విడుదలవనున్నట్లు సమాచారం.

Google Pixel 5A
గూగుల్​ పిక్సెల్​ 5ఏ ప్రతీకాత్మక చిత్రం
author img

By

Published : Jun 29, 2021, 6:48 PM IST

స్మార్ట్​ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ ప్రత్యేకతే వేరు. తక్కువ కెమెరాలతో సరికొత్త ఫీచర్లతో.. ఇతర కంపెనీలకు చెందిన ప్రీమియం మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది పిక్సెల్​. దీనితో ప్రపంచవ్యాప్తంగా పిక్సెల్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే.. భారీ అంచనాలు ఉంటాయి.

ఈ అంచనాల నడుమ.. గూగుల్ పిక్సెల్​ 5ఏ ను విడుదల చేసేందుకు గూగుల్​ సిద్ధమైంది. ఆగస్టులో ఈ మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

గతంలోలానే..

పిక్సెల్​ 4ఏను గత ఏడాది ఆగస్టు 3న ఆవిష్కరించి.. ఆగస్టు 20న ఎంపిక చేసిన మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చింది గూగుల్. అదే తరహాలో 'పిక్సెల్ 5ఏ'ను కూడా అమెరికా, జపాన్ వంటి మార్కెట్లలోనే తొలుత అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని ఓ టెక్ వార్తా సంస్థ పేర్కొంది.

గూగుల్ కూడా ఇప్పటికే.. 'పిక్సెల్ 5ఏ 5జీ' మోడల్​ ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించింది.

పిక్సెల్ 5ఏ ఫీచర్ల అంచనాలు..

  • 6.2 అంగుళాల ఓఎల్​ఈడీ స్క్రీన్​
  • క్వాల్కమ్​ 765జీ ప్రాసెసర్​
  • డ్యుయల్​ రియల్​ కెమెరా

పిక్సెల్​ నుంచి అక్టోబర్​లో 6, 6ప్రో మోడళ్లను కూడా విడుదల చేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి. ఈ ఫోన్ గూగుల్​ సొంత చిప్​సెట్​తో రానున్నట్లు తెలుస్తోంది. స్నాప్ ​డ్రాగన్​ 870 ప్రాసెసర్​ను పోలి ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి:జియో కొత్త ప్లాన్​- ఏడాది వరకు రోజుకు 3జీబీ డేటా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.