బంగారం, వెండి ధరలు సోమవారం మరింత పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.348 పెరిగి.. రూ.47,547 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసడి ధరలు పెరగటం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర ఏకంగా రూ.936 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.71,310 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,853 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.70 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.